ఓ మహిళ మాత్రం తాను చనిపోయిన తర్వాత దాదాపు ఐదేళ్లు స్వర్గంలో ఉండి వచ్చానని చెబుతూ అందరినీ షాకింగ్ కి గురి చేస్తుండటం విశేషం. ఈ మేరకు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. 

పుట్టిన ప్రతి ఒక్కడూ చనిపోవడం ఖాయం. అయితే, మనలో చాలా మంది నమ్మే విషయం ఏమిటంటే భూమి మీద బతికున్న సమయంలో తప్పులు చేసిన వారు చనిపోయాక నరకం వెళ్తారని, మంచి పనులు చేసేవారు స్వర్గానికి వెళతారు అని అనుకుంటూ ఉంటాం. మరి కొందరు ఇందులో ఎలాంటి నిజం లేదు అని భావిస్తూ ఉంటారు.

అయితే,చాలా మంది స్వర్గానికి మాత్రమే వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే, ఓ మహిళ మాత్రం తాను చనిపోయిన తర్వాత దాదాపు ఐదేళ్లు స్వర్గంలో ఉండి వచ్చానని చెబుతూ అందరినీ షాకింగ్ కి గురి చేస్తుండటం విశేషం. ఈ మేరకు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

లిండా క్రామెర్ అనే మహిళ వైద్య వృత్తికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకుని సేవలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2001 మే 6న లిండా తన ఇంట్లో టాయిలెట్‌కి వెళ్తుండగా కింద పడింది. తలకు గాయమై ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మరణించిందని ధ్రువీకరించారు. 

కానీ, చివరి ప్రయత్నంగా ఆమెను బతికించడానికి సీపీఆర్ చేశారు. సుమారు 14 నిముషాల పాటు ఆమె అచేతన స్థితికి వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమె లేచి కూర్చుంది. అయితే, ఆ సమయంలో తాను చనిపోయి స్వర్గానికి వెళ్లానని, అక్కడ అలా ఉంది, ఇాలా ఉంది అని చెప్పడం విశేషం.

ఆమె చెబుతున్న విషయాలను కొందరు కొట్టి పారేస్తున్నారు. ఆమె ఏదో భ్రమలో ఉండి అలా మాట్లాడుతోంది అంటూ అందులో ఎలాంటి నిజం లేదు అని వైద్యులు అంటున్నారు. ఆమె కూడా ఓ డాక్టర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడటం ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు.