ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళపై దాడి చేసి ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరిగెత్తించారు. వివరాల్లోకి వెళితే... భదోహి జిల్లా గోపిగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో మహిళను లాలాచంద్ర అనే ఆకతాయి వేధించాడు..

దీనిని ఆమె ప్రతిఘటించడంతో అతను కోపంతో ఊగిపోయాడు.. వెంటనే మరో ముగ్గురితో కలిసి మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వివస్త్రను చేసి వెంటపడుతూ ఊరంతా పరుగెత్తించారు.

దీనిని గ్రామస్తులంతా చూశారు కానీ ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా వీడియోలు, ఫోటోలు తీసుకుని దానిని సోషల్ మీడియాలో పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి, గోపీగంజ్ ఇన్‌స్పెక్టర్‌ అనిల్ యాదవ్‌ను అక్కడి బాధ్యతల నుంచి తప్పించారు.