Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. చనిపోయిందనుకుంటే అంబులెన్స్ లో లేచి కూర్చుంది..

తన భార్య మళ్ళీ మామూలు అవుతుందని భావించిన మాతాదీన్ కు చనిపోయిందంటూ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంతేకాదు మృతదేహాన్ని అక్కడే అంత్యక్రియలు చేయమని కూడా చెప్పారు. కానీ, తన స్వగ్రామానికి తీసుకెళ్లి అక్కడ చేస్తానంటూ ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకెళ్తున్నాడు. 

woman wakes up in ambulance after being declared dead in uttar pradesh  - bsb
Author
First Published Jan 1, 2024, 8:41 AM IST

ఉత్తర ప్రదేశ్ : కొన్నిసార్లు ఊహకందని విచిత్రమైన ఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని  తీవ్ర విస్మయానికి లోనుచేస్తాయి. అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో. చనిపోయిందనుకున్న మహిళ ఏకంగా లేచి కూచింది. దీంతో అంబులెన్స్ లో ఆమెతోపాటు ఉన్నవారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓ మహిళకు అనారోగ్యం తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. 

చేసేదేం లేక బంధువులు ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తున్నారు. కొద్ది దూరం వచ్చేసరికి.. ఉన్నట్టుండి ఆమె లేచి కూర్చుంది. దాహం వేస్తుంది అంటూ నీళ్లు ఇవ్వాలని అడిగింది.  మహిళా చనిపోయిందని తీవ్ర విషాదంలో ఉన్న ఆమె భర్త మిగతా బంధువులు ఒకసారిగా ఈ ఘటనతో అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆమె చనిపోలేదని.. వైద్యుడు తప్పుగా ప్రకటించారని గుర్తించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని హమీర్పూరు జిల్లా రాఠ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని సదర్ గ్రామంలో వెలుగు చూసింది.

శిష్యుడు రేవంత్ బాటలోనే గురూజీ చంద్రబాబు... టిడిపి ఆరు గ్యారంటీ హామీలు

అక్కడ ఉండే మతాధిన్ రక్వార్ అనే వ్యక్తి భార్య అనిత (33). ఆమె కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించడం కోసం అనేక నగరాల్లో చూపించారు. అమృత్సర్, గోపాల్,  జలంధర్  నగరాల్లోని పెద్ద ఆసుపత్రిలో చూపించారు. అయినా ఆమెకు నయం కాలేదు. 15 రోజుల క్రితం అనిత పరిస్థితి మరింత సీరియస్ కావడంతో… స్థానికంగా ఉన్న ఆసుపత్రిక తీసుకెళ్లారు. 

డబ్బులు కడితేనే చికిత్స ప్రారంభిస్తామని చెప్పిన వైద్యులు రూ. 20000 కట్టిన తర్వాతే చికిత్స మొదలుపెట్టారు. మరుసటి రోజు కూడా రూ.60 వేలు కట్టించుకున్నారు. ఈ మేరకు అనిత భర్త మతాదిన్ తెలిపాడు. తన భార్య మళ్ళీ మామూలు అవుతుందని భావించిన మాతాదీన్ కు కాసేపటికే భార్య చనిపోయిందంటూ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంతేకాదు మృతదేహాన్ని అక్కడే అంత్యక్రియలు చేయమని కూడా చెప్పారు. కానీ, తన స్వగ్రామానికి తీసుకెళ్లి అక్కడ చేస్తానంటూ ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో అనిత లేచి కూర్చుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios