యూపీలోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ మహిళ 7 నెలలుగా అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మార్చి 31న మహిళకు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. మహిళ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉంది. గత వారం ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఢిల్లీ ఎయిమ్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి కథ ఇది. 

రోడ్డు ప్రమాదం కారణంగా ఓ మహిళ 7 నెలలుగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ.. అపస్మారక స్థితిలో ఉంది. మృత్యువుతో పోరాడుతున్న ఈ మహిళ గత వారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రోడ్డు ప్రమాదంలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.ఆమె తలకు అనేక గాయాలయ్యాయి. ఇప్పటికే ఆమెకు అనేక సర్జరీలు కూడా చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సర్జరీలు చేయాల్సి వచ్చింది. మహిళ హెల్మెట్ ధరించి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని డాక్టర్ చెప్పారు.

ప్రమాదం ఎలా జరిగింది? 

మార్చి 31న ఆ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో ఆమె తలకు పలు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కళ్లు తెరిచినా.. ఎలాంటి స్పందన లేదు. అయితే, ప్రమాద సమయంలో ఆమె గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఇక అప్పటి నుంచి ఆ మహిళ ఆసుపత్రిలోనే అచేతన స్థితిలో చికిత్స పొందుతోంది

 ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సలహా ఇస్తూ ద్విచక్ర వాహనంలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంలో మహిళ హెల్మెట్ ధరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అన్నారు. మహిళ భర్త వృత్తి రీత్యా ప్రైవేట్ డ్రైవర్. భార్యకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నిత్యం ఆమెకు సేవలందిస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగం కూడా వదిలేశాడు.

ప్రమాద సమయంలో 40 రోజులు గర్భవతి

గాయపడిన స్థితిలో ఆసుపత్రికి వచ్చినప్పుడు మహిళ 40 రోజుల గర్భవతి అని ప్రొఫెసర్ దీపక్ గుప్తా తెలిపారు. గైనకాలజిస్ట్ విభాగం మహిళను క్షుణ్ణంగా పరీక్షించింది. విచారణలో బాలిక పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత మహిళ పరిస్థితిని చూసిన వైద్యులు ప్రసవ నిర్ణయాన్ని పూర్తిగా రోగి కుటుంబ సభ్యులకే వదిలేశారు. ఈ స్థితిలో కోర్టును ఆశ్రయించడమే కాకుండా ఆ మహిళ భర్త బిడ్డ పుట్టేందుకు అంగీకరించాడు. తల్లి తన బిడ్డకు ఆహారం ఇవ్వలేనందున, బాటిల్ సహాయంతో పసికందుకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని గుప్తా తెలిపారు.