దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రూప, ప్రియుడు కి రూ.15 లక్షలకు సుపారి ఇచ్చింది. దీంతో.. అతను ఆమె భర్తను చంపేందుకు  నలుగురు  దుండగులను మాట్లాడాడు. 

ఓ మహిళ... భర్త ను అంతమొందించి.. ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంది. ఈ క్రమంలో... ప్రియుడికి రూ.15లక్షల సుపారీ ఇచ్చి మరీ.. భర్తను చంపాలని ప్లాన్ వేసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యశంతపుర ప్రాతానికి చెందిన రూప, గిరీశ్ లకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల రూప ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. అక్కడ కుమార్‌ జైన్‌ అనే వ్యక్తితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. రూప సంగతి తెలిసిన భర్త పనికి వెళ్లవద్దంటూ కట్టడి చేశాడు.

దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రూప, ప్రియుడు కి రూ.15 లక్షలకు సుపారి ఇచ్చింది. దీంతో.. అతను ఆమె భర్తను చంపేందుకు నలుగురు దుండగులను మాట్లాడాడు. ఆ నలుగురు దుండగులు మాదనాయకనహళ్లిలో మంకీ క్యాప్‌ ధరించి తిరుగుతుండగా పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించగా సుపారి విషయం బయటపడింది. రూప, కుమార్‌జైన్‌ మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు ముందుగా స్పందించడంతో.. గిరీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు.