Asianet News TeluguAsianet News Telugu

కొడుకును చూడాలని.. ఐసోలేషన్ వార్డ్ నుంచి మహిళ..

ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉన్న 26 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కొడుకును కలుసుకోవాలని ఆరాటపడుతోంది. ఇందుకోసం మూడుసార్లు ఆసుపత్రి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. 

woman try to escape from isolation ward in haryana
Author
Hyderabad, First Published Apr 23, 2020, 8:55 AM IST

ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో.. ఐసోలేషన్ వార్డులో ఉంచారు. కరోనా లక్షణాలు బయటపడటానికి దాదాపు 20 రోజులకు పైగా సమయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే.. ఆమె మాత్రం అక్కడ ఉండలేకపోయింది. తన రెండేళ్ల కుమారుడు బయట ఉండటంతో.. వాడిని చూడటానికి దాదాపు మూడుసార్లు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానాలోని ఫతేహాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉన్న 26 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కొడుకును కలుసుకోవాలని ఆరాటపడుతోంది. ఇందుకోసం మూడుసార్లు ఆసుపత్రి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. 

మార్చి 12 న ఫతేహాబాద్ లోని పిలి మండోరి గ్రామస్తులు ఆమెను ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఆమె అస్సామీలో మాట్లాడుతోంది.  ఆమె కుమారుడు అసోమ్ లో ఉన్నట్లు తేలింది. మహిళను గ్రామం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 

ఆ మహిళకు కరోనా టెస్ట్ జరిగిందని, నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని డాక్టర్ హనుమాన్ చెప్పారు. ప్రస్తుతం, ఆ మహిళ ఆరోగ్య భద్రత కోసం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అయితే ఐసోలేషన్ వార్డులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ నుంచి ఆమె  తప్పించుకునే ప్రయత్నం చేసిందని  ఆయన చెప్పారు. అసోమ్ లో ఆమెకు భర్త, రెండేళ్ల కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios