Asianet News TeluguAsianet News Telugu

నమ్మించి.. వివాహితపై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి.. అపస్మారక స్థితిలోకి వెళ్ళినా.. విడిచిపెట్ట‌ని కామాంధులు..

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో హర్యానాకు చెందిన 48 ఏళ్ల మహిళను ఇద్దరు వ్యక్తులు కొట్టి, అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. ఆ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి

woman thrashed, gang-raped in UP Shamli, one arrested
Author
First Published Sep 13, 2022, 3:33 PM IST

‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’  అంటే.. ఎక్క‌డ స్త్రీలు గౌరవించబడుతుందో అక్కడ దేవతలు న‌డ‌యాడుతారని అర్థం. కానీ, నేటీ స‌మాజంలో ఆడపిల్లగా పుట్టడం, పుట్టినా సురక్షితంగా మనుగడ సాగించ‌డం దుర్భరంగా  మారింది. మహిళల, చిన్నారుల హ‌క్కుల కోసం, వారి ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వాలు ఎన్ని చట్టాలను అమ‌లు చేసినా ఫ‌లితం నామమాత్రమే..

నిత్యం ఎదోక చోట చిన్నారుల‌పై,  మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ‌వాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కొంద‌రూ మృగాళ్లు విచక్షణ మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. త‌మ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో దారుణం జ‌రిగింది. పొట్ట కూటి కోసం హర్యానాలోని పానిపట్‌కు నుంచి వ‌చ్చిన  48 ఏళ్ల మహిళను ఇద్ద‌రూ వ్య‌క్తులు న‌మ్మించి మోసం చేసి.. దాడి చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకెళ్తే.. యూపీలోని షామ్లీ జిల్లాలో సోమవారం హర్యానాలోని పానిపట్‌కు చెందిన 48 ఏళ్ల మహిళ నివ‌సిస్తుంది. అయితే.. ఇటీవ‌ల త‌న భ‌ర్త కుమార్ ఏదో ఘ‌ట‌న‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే..  జైలులో ఉన్న త‌న భార్తను బెయిల్‌పై విడుదల చేస్తామని సోమవారం రాహుల్ అనే కామాంధుడు బాధిత మహిళకు ఫోన్ చేసి న‌మ్మించారు. పథ‌కం ప్ర‌కారం.. ఆమెను ఓ నిర్మానుష్య ప్ర‌దేశానికి ర‌ప్పించుకున్నాడు. 

ఈ క్ర‌మంలో రాహుల్, త‌న స్నేహితుడు మోహన్‌తో కలిసి ఆమెను ఆర్తి గ్రామంలోని అడవిలోకి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచార య‌త్నం చేశారు. వారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ మ‌హిళ‌ అపస్మారక స్థితికి వెళ్లింది. ఆ త‌రువాత వివస్త్రను చేసి చేర్చారు. ఆ తర్వాత ఆమెను అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అనంతరం ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (షామ్లీ) అభిషేక్ కుమార్ తెలిపారు. మోహన్‌ను అరెస్టు చేయగా, రాహుల్ ఇంకా పరారీలో ఉన్నట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios