కోల్ కతా: ఓ మహిళ తన తండ్రి అత్యంత దారుణంగా చంపేసింది. అతన్ని డిన్నర్ కు తీసుకుని వెళ్లి, తాగించి హత్య చేసింది. కోల్ కతాలోని పార్క్ సర్కస్ సమీపంలో గల క్రిస్టఫర్ రోడ్డుకు చెందిన 22 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి ఆ దారుణానికి ఒడిగట్టింది. 

హుగ్లీ నది ఒడ్డున బెంచీపై 56 ఏళ్ల మహిళ తండ్రి నిద్రపోయాడు. ఆ సమయంలో అతనిపై మహిళ కిరోసిన్ పోసి ఒంటికి నిప్పంటించింది. ఆ సంఘటన సీసీటీవీలో రికార్డయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 

తన చిన్న వయస్సులోనే తల్లి మరణించిందని, అప్పటి నుంచి తన తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడని, ఉద్వేగంలో తనను వేధిస్తూ వచ్చాడని ఆమె చెప్పింది. తనకు వివాహమైన తర్వాత అతని అరాచకం ఆగిపోయిందని, అయితే భర్తతో విడాకులు తీసుకుని తాను తిరిగి వచ్చానని, అప్పటి నుంచి మళ్లీ తనను తండ్రి వేధిస్తూ వచ్చాడని ఆమె చెప్పింది. 

మహిళ తన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు చెప్పారు. మార్చి 29వ తేదీన వరకు ఆమెను పోలీసు కస్టడీకి అప్పగించారు.