లక్నో:లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్య చేసుకొంది.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ లోని బులంద్‌షహర్ ఎస్పీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్ అనే మహిళ అనూప్ షహర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్ లో 2015 నుండి ఎస్సైగా పనిచేస్తోంది.షామ్లి జిల్లాలో ఆమె ఒంటరిగా పనిచేస్తోంది.  అయితే కొంతకాలంగా ఆమెకు లైంగిక వేధింపులు ఎదురౌతున్నాయి. ఈ విషయమై ఆమె తీవ్రంగా మనోవేదనకు గురైంది. 

లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకొందని భావిస్తున్నారు.  ఇంటి యజమాని ఫోన్లు చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంటి వెంటిలేటర్ నుండి చూస్తే అర్జూ పవార్ సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకొన్నట్టుగా గుర్తించారు.

సంఘటన స్థలంలో సూసైడ్ నోట్, పెన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతురాలి ఫోన్ లాక్ చేసి ఉంది. ఈ లాక్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఎస్పీ  తెలిపారు.ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరెవరితో మాట్లాడిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.