Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం తిరస్కరించిందని.. మహిళను నగ్నంగా చేసి, తీవ్రంగా కొట్టి... ప్రియుడి ఘాతుకం..

పట్టపగలు కొందరు వ్యక్తులు ఓ మహిళను రోడ్డుపై బట్టలు విప్పి రాడ్‌లతో తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Woman Stripped, Beaten Up Over Extramarital Affair In Madhya Pradesh, Four Arrested
Author
Hyderabad, First Published Aug 12, 2022, 12:08 PM IST

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఝబువా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళను కొంతమంది వివస్త్రను చేసి కొట్టారు. ఈ నేరానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా గిరిజనులని, కూలీలుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. రూపారెల్ గ్రామానికి చెందిన బాధిత మహిళ కొన్ని నెలల క్రితం తన భర్తను విడిచిపెట్టింది. ప్రస్తుతం మరొక వ్యక్తితో నివసిస్తుంది.

బుధవారం ఆమె తన భర్త ఇంటికి తిరిగి వెళ్లింది. దీంతో ఆమెతో సహజీవనం చేస్తున్న ముఖేష్‌కు కోపం వచ్చింది. అతను మరికొంతమందితో కలిసి గ్రామానికి వచ్చి ఆమెపై, ఆమె భర్తపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో, పట్టపగలు కొందరు వ్యక్తులు మహిళను రోడ్డుపై బట్టలు విప్పి.. రాడ్‌లతో కొట్టడం కనిపిస్తుంది. మరికొందరు వారిని అడ్డుకునేందుకు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడం కనిపించింది.

ఈ వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులకు సమాచారం అందించారు కొందరు. దీంతో పోలీసులు వెంటనే గ్రామనికి చేరుకుని.. ఆ మహిళను చికిత్స నిమిత్తం పెట్లవాడ ఆసుపత్రికి తరలించారు. ముఖేష్ తనను వేధించేవాడని, అందుకే తన భర్త ఇంటికి తిరిగొచ్చేశానని ఆ మహిళ చెప్పిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ తివారీ తెలిపారు. ముఖేష్ తో సహజీవనం చేసినా.. ఆమె భర్త ఆమెను తిరిగి స్వీకరించాడని.. కానీ, ముఖేష్ వచ్చి గొడవ మొదలుపెట్టాడని తెలిపారు.

"అతను వస్తూనే ఆమె బట్టలు లాగేసి.. నగ్నంగా మార్చి బెత్తంతో కొట్టాడు. అతనికి మిగతావారు సహకరించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేయబడింది. ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, అల్లరి పెట్టడం, దాడి చేయడం లేదా ఒక మహిళ గౌరవాన్ని భంగం కలిగించేలా వ్యవహరించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం లాంటి నేరారోపణలు వారిమీద మోపబడ్డాయి" అని అధికారి తెలిపారు. 

రెండు పెళ్లిళ్లైన వ్యక్తితో వివాహేతరసంబంధం.. ఎఫైర్ కోసం ప్రియుడి రెండో భార్యను చంపిన ప్రియురాలు..

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య.. భర్తమీద పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఆగ్రా డివిజన్‌లోని మధుర జిల్లాలో ఈ సోమవారం రాత్రి ఓ మహిళ తన భర్తకు పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. 80 శాతం కాలిన గాయాలతో ఆ వ్యక్తి మంగళవారం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటూ మరణించాడు. ఈ సంఘటన కోసికలన్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం, రేఖ అనే మహిళకు వివాహం అయ్యింది. అయితే, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం మీద ఆమె భర్త చమన్ ప్రకాష్ అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని భార్యను అడగడంతో సోమవారం భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. 

ఆ తరువాత రాత్రి చమన్ ప్రకాష్ గాఢనిద్రలో ఉన్న సమయంలో రేఖ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. "కోసి కలాన్‌లోని మీనా నగర్ కాలనీకి చెందిన మృతుడు చమన్ ప్రకాష్ కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేఖపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయబడింది" అని స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనుజ్ కుమార్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios