లక్నో: తన  శారీరక కోర్కెలను తీర్చడానికి ఒప్పుకోలేదన్న కోపంతో ఓ యువకుడు మేనత్తను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్లో ఆలస్యంగా వెలుగుచూసింది.

మీరట్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు బీకామ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బుధవారం మేనత్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరక కోర్కెలు తీర్చాలని ఆమెను అడిగాడు. దీంతో ఆమె, అతడి చెంప పగులగొట్టింది. ఆ విషయం ఇంట్లో వారికి చెబుతానని బెదిరించింది.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. తనకేమీ తెలియనట్లు అక్కడినుంచి జారుకున్నాడు.పోలీసులు అతడ్ని విచారిస్తున్న సమయంలో ఆందోళనకు గురయ్యాడు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. 

అతడి చేతిపై, రొమ్ముపై ఉన్న గాయాలను గుర్తించి, వాటి సంగతి అడగ్గా నీళ్లు నమిలాడు. మరికొంత గట్టిగా అడిగే సరికి చేసిన నేరం ఒప్పుకున్నాడు.