న్యూఢిల్లీ: మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగా భార్యపై 25 సార్లు కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మార్కెట్ లో జరిగింది. 

ఆ దాడికి సంబంధించిన వీడియో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఢిల్లీలోని బుద్ధ విహార్ లో తన భార్య నీలును భర్త హరీష్ హత్య చేశాడు జోక్యం చేసుకుని మహిళను కాపాడడానికి ప్రయత్నించినవారిని అతను బెదిరించాడు. దగ్గరికి వస్తే చంపేస్తానని గట్టిగా అరుస్తూ బెదిరించాడు. 

ఇద్దరు వ్యక్తులు ఏమీ జరగనట్లుగా, సంఘటనను పట్టించుకోకుండా నడిచి వెళ్తుండడం వీడియోలో కనిపించింది. నిందితుడు మ్యారేజీ బ్యూరోలో పనిచేస్తున్నాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.