ఒక స్త్రీకి మరో స్త్రీ కష్టాలు తెలుస్తాయంటారు.. అలాంటిది నిండు గర్బిణీ పట్ల ఓ పోలీసు అధికారిణి అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది.

వివరాల్లోకి వెళితే.... గత నెల 3న సుందర్‌గఢ్ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఒక యువకుడు మృతిచెందడంతో ఇందుకు కారణహైన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు.

ఈ కేసులో ఒకరు బాధితురాలు ప్రియా డే భర్త ఉత్తమ్ డే. కేసు దర్యాప్తును చేపట్టిన ఎస్పీ సౌమ్య మిశ్రా... అతని ఆచూకీ చెప్పాల్సిందిగా నిండు గర్బిణీ అని కూడా చూడకుండా చేయి చేసుకోవడంతో పాటు.. పొట్ట మీద బూటు కాలితో తన్నారు.

దీంతో ప్రియా డేకు గర్భస్రావం జరిగింది. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె సౌమ్యా మిశ్రాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఒడిశా హైకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు ఎస్పీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.