Asianet News TeluguAsianet News Telugu

అక్రమ సంబంధంపై పంచాయతీ తీర్పు: భర్తను భుజాలపై మోస్తూ నరకయాతన

చంద్రుడిపైకి కాలుమోపే స్థాయికి భారతదేశం చేరుకుంటున్న కాలంలోనూ ఇంకా మూఢనమ్మకాలు, అనాగరిక చర్యలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి

Woman Shamed, Forced To Carry Husband And Walk. Villagers Shot Videos in madhya pradesh
Author
Madhya Pradesh, First Published Jul 30, 2020, 5:52 PM IST

చంద్రుడిపైకి కాలుమోపే స్థాయికి భారతదేశం చేరుకుంటున్న కాలంలోనూ ఇంకా మూఢనమ్మకాలు, అనాగరిక చర్యలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో చేసిన తప్పుకు శిక్షగా భర్తను భుజాపై ఎత్తుకుని ఊరంతా తిప్పాలని భార్యకు తీర్పుచెప్పారు గ్రామ పెద్దలు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబువా జిల్లాకు చెందిన భార్యాభర్తలు ఉపాధి కోసం గుజరాత్‌‌కు వెళ్లారు. రోజువారీ కూలీలుగా పనిచేసేవారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.

అయితే కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో వీరికి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో దంపతులు స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న తర్వాత సదరు భర్త.. తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని కుటుంబసభ్యులు, గ్రామస్తుల ముందు అనుమానం వ్యక్తం చేశాడు.

దీంతో ఎలాగైనా ఆమెకు బుద్ధి చెప్పాలని అంతా నిర్ణయించుకున్నారు. తప్పు చేసిందని ఆరోపిస్తూ భర్తను మోసుకుని ఊరంతా తిప్పాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఇందుకు అంగీకరించిన బాధితురాలు భర్తను మోయలేక ఇబ్బంది పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios