Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పద తీర్పులు.. జడ్జికి కండోమ్ పంపిన మహిళ

కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తసుకున్నారు. కాగా.. తాజాగా.. ఓ మహిళ సదరు జడ్జి పై వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది.

Woman sends condoms to Justice Ganediwala in protest against her controversial POCSO rulings
Author
Hyderabad, First Published Feb 18, 2021, 7:48 AM IST

ఈ మధ్యకాలంలో బాంబే హైకోర్టు ఇచ్చినన్ని వివాదాస్పద తీర్పులు మరే న్యాయస్థానం ఇవ్వలేదనే చెప్పాలి. లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు నాగపూర్ బెంజ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో ఆ తీర్పులే ఆమె పదోన్నతికి ఎసరుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తసుకున్నారు. కాగా.. తాజాగా.. ఓ మహిళ సదరు జడ్జి పై వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది.

ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను వ్యతిరేకిస్తూ.. నిరసనగా జడ్జికి కండోమ్‌లు పంపింది. అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్‌ గనేడివాలా పని చేస్తోన్న బాంబే హైకోర్టు  నాగ్‌పూర్‌ బెంచ్‌ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు వెల్లడించింది. 

ఈ సందర్భంగా దేవ్‌శ్రీ త్రివేది మాట్లాడుతూ.. ‘‘అన్యాయాన్ని నేను సంహించలేను. గనేడివాలా తీర్పు వల్ల ఓ మైనర్‌ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెని సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్‌ ప్యాకెట్లు పంపాను. మొదట ఈ నెల 9న కొన్ని ప్యాకెట్లు పంపాను. అవి చేరుకున్నట్లు రిపోర్ట్‌ అందింది. ఆ తర్వాత మరో 12 చోట్లకు కండోమ్‌ ప్యాకెట్లు పంపాను అని తెలిపింది.

‘‘ఓ మహిళగా నేను చేసిన పని తప్పని భావించడం లేదు. దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలి. ఇక జస్టిస్‌ గనేడివాలా లాంటి వారి వాల్ల మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఆడవారిపై అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. అప్పుడు అత్యాచారాలు స్త్రీల దుస్తుల మీదుగానే జరుగుతాయి’’ అంటూ దేవ్‌శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో బాలికలపై లైంగిక దాడుల కేసులో జస్టిస్‌ పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘నేరుగా బాలిక శరీరాన్ని తాకుకుండా జరిగే లైంగిక దాడి పోక్సో కిందకు రాదని’’.. ‘బాలిక చేతిని పట్టుకుని అతను ప్యాంట్‌ జిప్‌ తెరిచినంత మాత్రాన లైంగిక దాడిగా పరగణించలేం’’ అంటూ సంచలన తీర్పులు వెల్లడించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios