మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నా కూడా.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా అర్థమైంది. రోడ్డు మీద వెళ్తున్న ఓ యువతి అనుకోకుండా ప్రమాదంలో పడింది.
మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతో మంది రోడ్డు ప్రమాదాల కారణంగా బలౌతున్నారు. అంతెందుకు రెప్పపాటు కాలంలో కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న రోజులు ఇవి. అయితే... ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదం అంటే... మద్యం మత్తులోనే, అతి వేగం కారణంగానే, మన అజాగ్రత్త కారణంగానో జరుగుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ... మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నా కూడా.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా అర్థమైంది. రోడ్డు మీద వెళ్తున్న ఓ యువతి అనుకోకుండా ప్రమాదంలో పడింది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో గురించి పూర్తి వివరాల్లోకి వెళితే...
ఓ యువతి రోడ్డు మీద స్కూటీ మీద వెళుతోంది. ఆ సమయంలో రోడ్డు మీద ఓ కారు పార్క్ చేసి ఉంది. సరిగ్గా ఆ యువతి కారు పక్కనుంచి వెళ్తున్న సమయంలో... కారులో నుంచి దిగడానికి డోర్ ఓపెన్ చేశారు. ఆ డోర్ స్కూటీ మీద వెళ్తున్న యువతికి తగిలింది. వెంటనే ఆమె కిందకు పడిపోయింది. ఆ వెంటనే వెనక నుంచి వస్తున్న మరో కారు ఆ యువతి మీద దూసుకెళ్లింది. ఆ కారు డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ.. యువతికి తీవ్రగాయాలు అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా... వాహనాలు నడిపేవారికి సూచనలు చేస్తున్నారు. కారు పార్క్ చేసిన సమయంలో.. డోర్ ఓపెన్ చేసేటప్పుడు పక్కన ఏదైనా వాహనం వస్తుందో లేదో చూసుకోవాలని సూచిస్తున్నారు.
