ఎమర్జెన్సీ అంటూ లిఫ్ట్ అడిగిన ఓ మహిళ సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోపిడీ చేసిన సంఘటన దొడ్డ తాలూకాలో వెలుగుచూసింది. తాలూకాలోని వడ్డెర హల్లికి చెందిన నంజేగౌడ ఈ ఘటనలో దోపిడీకి గురయ్యాడు. ఎం స్యాండ్ వ్యాపారం చేసే నంజేగౌడ ఎప్పుడు మెడలో బంగారు గొలుసు వేసుకుని ఉంటాడు.

తరచూ దొడ్డ పట్టణానికి వచ్చి స్వగ్రామానికి తిరిగి వెళుతుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 26న నంజేగౌడ పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ నుండి బైక్ మీద బయలుదేరాడు. అదే సమయంలో నంజేగౌడ బైకును లక్ష్మి అనే మహిళ ఆపింది.
స్నేహితురాలు డెలివరీకి అర్జెంటుగా డబ్బులు కావాలని, ఇవ్వాలని అడిగింది. అంతేకాదు ఘాటి రోడ్డులో తనను దింపాలని లిఫ్ట్ ఇవ్వమని అడిగింది. దీంతో లక్ష్మి మాటలు నమ్మిన నంజగౌడా ఆమెను తీసుకెళ్లాడు. అయితే మార్గమధ్యలో ఎందుకో అనుమానం వచ్చి ప్రశ్నించాడు.
అంతలో వెనకనే మరోబైకు పై అనుసరించి వచ్చిన రాజేష్, మణికంఠ నంజేగౌడ పై దాడి చేసి బంగారు గొలుసులు లాక్కున్నారు. నంజేగౌడ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మణికంఠను పట్టుకున్నారు. లక్ష్మీ, రాజేష్ బంగారు గొలుసులతో పరారయ్యారు, మణికంఠను అదుపులోకి తీసుకున్న దొడ్డ గ్రామీణ పోలీసులు పరారైన లక్ష్మీ, రాజీవ్ లను కూడా అరెస్టు చేశారు.