అతని వద్ద బాధిత యువతి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్.. మంగళవారం పని ఉందని చెప్పి బాధితురాలిని కళ్ాయణ్ పూర్ లోని తన ఫ్లాట్ కి తీసుకువెళ్లాడు. 

దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. ఈ ఘోరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..19ఏళ్ల యువతిపై రేప్ చేసి పదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తన వద్ద ఉద్యోగం చేస్తున్న యువతిని లైంగికంగా లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నం బెడసికొట్టడంతో పథకం ప్రకారం.. తన ఫ్లాట్ కు రప్పించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ తర్వాత ఈ ఘటనలో తన తప్పు ఏమీ లేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు నిందితుడు పోలీసుల వద్ద నిజం అంగీకరించాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతీక్ వైశ్(40) అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతని వద్ద బాధిత యువతి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్.. మంగళవారం పని ఉందని చెప్పి బాధితురాలిని కళ్ాయణ్ పూర్ లోని తన ఫ్లాట్ కి తీసుకువెళ్లాడు. 

తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. డబ్బు ఇస్తానని కూడా ఆశ చూపాడు. అయితే.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి వివరించారు. ఈ దారుణం గురించి పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించడంతో నిందితుడు పదో అంతస్తులో తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు తోసేయడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిందిదతుడిని బుధవారం అరెస్టు చేసి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి కస్టడీకి తరలించినట్లు తెలిపారు.