ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ వ్యక్తి.. మహిళను కలుద్దామని హోటల్ గదికి పిలిచి.. మత్తుమందు ఇచ్చి అత్యచారానికి పాల్పడ్డాడు.
ఢిల్లీ : దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. కోర్టు శిక్షలు అనుభవిస్తున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నైరుతి ఢిల్లీలోని ద్వారకాలో ఒక హోటల్ లో మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ జూన్ 3న పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ కు చెందిన వ్యక్తి తనకు డేటింగ్ యాప్ లో కలిశాడని మే 30న అతనితో కలిసి హోటల్ కి వెళ్లగా అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన ఫోన్ కాల్స్ కు ఆన్సర్ చేయడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని… పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ద్వారకా డీసీపీ ఎం. హర్షవర్ధన్ వెల్లడించారు.
కాగా, మే 30న నైరుతి ఢిల్లీలోని ద్వారకలోని ఓ లగ్జరీ హోటల్‌లో 28 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన నిందితుడిని వెతికి పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందం హైదరాబాద్‌లో క్యాంప్ చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనుమానితుడిని డేటింగ్ వెబ్‌సైట్‌లో మహిళ కలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 3న మహిళ ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) హర్షవర్ధన్ మండవ తెలిపారు.
28 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో మోహక్ గుప్తా అనే వ్యక్తిని డేటింగ్ యాప్‌లో కలిశానని, ఆ తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారని పోలీసులు తెలిపారు. ఆ తరుాత ఇద్దరూ తమ కాంటాక్ట్ నంబర్లు మార్చుకుని చాటింగ్ మొదలుపెట్టారు. అలా, మే 30న గుప్తా ఢిల్లీకి వచ్చి తనను కలవాలని మహిళను కోరాడు. వారు ద్వారకలోని ఒక హోటల్‌లో కలుసుకున్నారు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం అందించాడు. దీంతో పానీయం తాగగానే స్పృహ తప్పి పడిపోయానని, ఆ తరువాత హోటల్ గదిలో ఆ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది. మరుసటి రోజు, ఆ వ్యక్తి ఆమెను మెట్రో స్టేషన్ బయట దింపాడని, మహిళ ఫిర్యాదును ఉటంకిస్తూ ఒక పోలీసు అధికారి తెలిపారు.
“ఆ తర్వాత గుప్తా ఆమె కాల్‌లకు సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ పోలీసులకుఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 328 (నేరం చేసే ఉద్దేశ్యంతో విషం మొదలైన వాటి ద్వారా గాయపరచడం), 376 (రేప్) కింద కేసు నమోదు చేశాం. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి' అని అధికారి తెలిపారు.
