ఆ సమయంలో ఇద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి ఉన్నారు. నిజానికి ఆమె ప్రపోజ్ చేసిన వీడియో చాలా క్యూట్ గా ఉంది. కొందరిని బాగా ఆకట్టుకుంటోంది కూడా. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా కూడా మారింది.

గుడి, దేవాలయ పరిసర ప్రాంతాలను చాలా పవిత్ర స్థలాలుగా పరిగణిస్తారు. దేవాలయాల్లో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే, ఓ యువతి దేవాలయాలన్ని తన లవ్ ప్రపోజ్ చేయడానికి ఎంచుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఆమె చేసిన పని ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఆమె చేసిన పనిని సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Scroll to load tweet…

ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లింది. అక్కడ ఆమె మోకాలి పై కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కి ఉంగరం తొడుగుతూ, తన మనసులోని మాటను తెలియజేసింది. ఆ సమయంలో ఇద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి ఉన్నారు. నిజానికి ఆమె ప్రపోజ్ చేసిన వీడియో చాలా క్యూట్ గా ఉంది. కొందరిని బాగా ఆకట్టుకుంటోంది కూడా. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా కూడా మారింది.

అయితే, ఆమె ప్రపోజ్ చేసిన స్థలం అభ్యంతరాలను వ్యక్తం చేయడం గమనార్హం. గుడిలో ఇలాంటి పనులు చేయడం ఏంటి అని అందరూ విమర్శిస్తున్నారు. ప్రపోజ్ చేయడానికి మరే స్థలం దొరకలేదా అని తిట్టిపోస్తున్నారు. కేదర్ నాథ్ పవిత్రతను దెబ్బ తీస్తున్నారని మండిపడుతున్నారు. 

 గుడిలోకి ఫోన్లు అనుమతించకపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటూ కొందరు కామెంట్స్ చేయడం విశేషం. అయితే, కొందరు మాత్రం సమర్థిస్తున్నారు. అందులో తప్పేముంది..? అంత క్యూట్ గా ఉంటే అని కొందరు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయడం విశేషం.