ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరిస్తూ వచ్చిన ఆమెకు భర్త మరో షాకిచ్చాడు. తన తండ్రి పడక సుఖం తీర్చాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు.

కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత భర్త పై ఉంటుంది. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన భార్యను ప్రేమగా చూసుకోవాల్సిందిపోయి... ఓ భర్త చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరిస్తూ వచ్చిన ఆమెకు భర్త మరో షాకిచ్చాడు. తన తండ్రి పడక సుఖం తీర్చాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ పరిధిలలోని స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. పెళ్లైన కొత్తలో భార్యను చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత నుంచి తనలోని శాడిస్టును బయటకు తీశాడు. భార్యను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా పాపం ఆమె భరిస్తూవస్తూ ఉంది. అయితే సడెన్ గా తన తండ్రి పడక సుఖం తీర్చాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆమె అంగీకరించకపోవడంతో... ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడు.

దీంతో... ఆమె చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం భర్త, అత్తమామలపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. ఎన్ని రోజులు చూసినా పోలీసులు స్పందించకపోవడంతో చివరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.