బాలాసోర్: కూతురిని హత్య చేసేందుకు ఓ తల్లి కిరాయి హంతకులకు రూ.50 వేలు చెల్లించింది. కూతురి హత్యకు సుపారీ ఇచ్చిన 58 ఏళ్ల మహిళను పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది.

తన కూతురి హత్యకు సుకురి గిరి అనే మహిళ ప్రమోద్ జెనా (32)కు, మరో ఇద్దరికి రూ.50 వేలు చెల్లించింది. ఈ కేసులో ప్రమోద్ జెనాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

సుకిరి గిరి కూతురు సిబానీ నాయక్ (36) అక్రమ మద్యం వ్యాపారంలో పాలుపంచుకోవడంతో తల్లీకూతుళ్ల మధ్య సంబంధం దెబ్బ తిన్నట్లు ప్రాథమిక విచారమలో తేలింది.

అక్రమ మద్యం వ్యాపారం నుంచి కూతురిని తప్పించడానికి సుకురి గిరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో కూతురిని చంపడానికి ప్రమోద్ జెనాతో ఒప్పందం కుదుర్చుకుందని, అందుకు రూ.50 వేలు చెల్లించిందని పోలీసులు తెలిపారు.