Asianet News TeluguAsianet News Telugu

మైనర్ క్లాస్‌మేట్‌ను పెళ్లాడి గర్భం దాల్చింది.. గర్భిణీ పై పోక్సో కేసు.. కస్టడీకి కోర్టు ఆదేశం

తమిళనాడులో ఓ యువతి తన కంటే చిన్నవాడైన ఓ మైనర్ అబ్బాయి, అదీ ఆమె క్లాస్‌మేట్‌‌తోనే పారిపోయి కలిసి జీవించింది. అనంతరం, ఆ యువతి గర్భం దాల్చింది. అబ్బాయి తల్లిదండ్రులు పిటిషన్ వేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. యువతిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది.
 

woman marries minor classmate, get pregnant, cops arrests woman in tamilnadu
Author
First Published Oct 12, 2022, 12:48 PM IST

చెన్నై: తమిళనాడులో ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. వారిద్దరూ క్లాస్‌మేట్లు. కానీ, అబ్బాయి కంటే ఆ అమ్మాయి పెద్దది. అబ్బాయి మైనర్. ఆ యువతి వయసు 20 ఏళ్లు. వాళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. ఇంట్లో చెప్పాపెట్టకుండా పరారయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చింది. తమ కొడుకును కోర్టులో హాజరుపరచాలని అబ్బాయి తల్లిదండ్రులు పిటిషన్ వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏప్రిల్ నెలలో అబ్బాయి కనిపించకుండా పోయాడు. అప్పుడు ఆ అబ్బాయి మైనర్. అనంతరం, అబ్బాయి తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. వారిద్దరూ కలిసి ఉంటున్నారని కనుగొన్నారు. చివరికి వారిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. మైనర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆ యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమెను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపుతామని వివరించారు. 

ఆమెను జ్యుడీషియల్ కస్టడీకికి పంపుతూ కోర్టు ఆదేశించిందని సేలం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నజ్ములా హోడా వివరించారు. 

Aslo Read: నెమలి ఈకలు ఇస్తానని ఆశపెట్టి, బాలికపై లైంగిక దాడి..మరణించే వరకు జైలు శిక్ష..

ఇదే రాష్ట్రంలో మరో ఘటన సంచలనం రేపింది. కడలోర్ జిల్లాలో ఓ బస్టాండ్‌లో 17 ఏళ్ల అబ్బాయి 16 ఏళ్ల అమ్మాయి మెడలో పెళ్లి చేసుకుంటున్నట్టు మంగళసూత్రం కట్టారు. ఈ వీడియో వైరల్ అయింది. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టి బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. ఆ అమ్మాయితో అబ్బాయికి లైంగిక సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయని, అమ్మాయిని మెడికల్ టెస్టులకు పంపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios