వృద్ధుడిని పెళ్లి చేసుకున్న మహిళ.. వారం రోజులకే నగదు, ఆభరణాలతో పరార్..
ఓ మహిళ ఓ వృద్ధుడిని వివాహం చేసుకుని నిండా ముంచింది. ఇంట్లోని నగదు, నగలతో పరారయ్యింది.

బెంగళూరు : ఓ మహిళ తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది తెలిసిన అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ పెళ్లి చేసుకున్న ఆ మహిళ వృద్ధుడిని వంచించి చివరికి ఇల్లు మొత్తం దోచేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. దీనికి సంబంధించి కాటన్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షణ్ముగం అనే 69 ఏళ్ల వృద్ధుడిని మల్లికా అనే 35 ఏళ్ల మహిళ రెండో వివాహం చేసుకుంది. బెంగళూరు స్థానిక ఓటిపి రోడ్డుకు చెందిన షణ్ముగం అంతకుముందే పెళ్లయింది. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఒంటరిగా ఉంటున్నాడు.
మల్లికా అలియాస్ మల్లర్ తమిళనాడు వాసి. ఆమె అతనితో పరిచయం పెంచుకుంది. తనని పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు షణ్ముగం కూడా అంగీకరించాడు. దీంతో జనవరి 4న వీరిద్దరికీ వివాహం అయ్యింది. ఈ వివాహం కోసం తమిళనాడు నుంచి తన పరిచయస్తులు ఇద్దరినీ మల్లిక పిలిపించింది. పెళ్లి తర్వాత మళ్లీ కకు తోడుగా వచ్చిన వ్యక్తులు 35వేల రూపాయలు కమిషన్ గా తీసుకొని వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత జనవరి 10 వరకు అంటే ఆరు రోజుల పాటు షణ్ముగంతోనే కలిసి ఉంది మల్లికా.
రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. సింధు జలాల ఒప్పందం పునరాలోచనపై ఆనాడే మోదీ హింట్..
ఆ తర్వాత ఓ రోజు ఇంట్లో ఉన్న కొంత నగదు, 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులు తీసుకుని ఇంట్లో నుంచి పరార్ అయింది. అయితే అప్పటికి కూడా ఆ వృద్ధుడికి తన భార్య చేసిన మోసం అర్థం కాలేదు. ఆమె కనిపించడం లేదంటూ అనేక చోట్ల వెతికాడు. ఆ తర్వాత అసలు విషయం అర్థమై మోసపోయానని గ్రహించాడు. కాటన్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లిక గురించి వెతుకుతున్నారు.