ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. సదరు మహిళను, హత్యకు సహకరించిన ఆమె ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బెంగళూరు పరిధిలోని వర్తూరు సిద్ధాపుర నివాసి పుష్పావతి (38), ఆమె ప్రియుడు మను (42) లు కలిసి చంద్రశేఖర్(40)ను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు.

మైసూరుకు చెందిన చంద్రశేఖర్ బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. పదిహేనేండ్ల కిందట పుష్పావతితో పెళ్లైంది. ఈ క్రమంలో ఏడేళ్ల క్రితం చంద్రశేఖర్‌కార్యాలయంలో జరిగిన ప్రమాదంలో తలకు తీవ్ర గాయం అయ్యింది. అప్పుడు శస్త్రచికిత్స చేశారు.
ఆపరేషన్ తర్వాతినుండి చంద్రశేఖర్ కు మూర్ఛ వ్యాధి పీడిస్తోంది. గత నెల 21 తేదీన అత్త గాయత్రికి ఫోన్ చేసిన పుష్పావతి ‘మీ కొడుకు బాత్రూంలో స్నానం చేస్తుంటే కింద పడి దెబ్బలు తగిలాయి. ఆస్పత్రికి తీసుకుపోతుంటే చనిపోయాడు’ అని చెప్పింది.
అయితే ఇంటికి వచ్చిన బంధువులకు పుష్పావతితో పొరుగింట్లో ఉండే మను సన్నిహితంగా ఉండడం అనుమానం కలిగించింది. దీంతో విచారించగా అసలు విషయం బయటపడింది. దీనిమీద వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, లోతుగా దర్యాప్తు చేయడంతో తామిద్దరూ కలిసి తలమీద రాడ్ తో కొట్టి చంపినట్టు అంగీకరించారు.