Woman Killed third Husband: నాలుగో పెళ్లి కోసం మూడో భర్తను చంపేసి..
Patna: మూడో భర్తను చంపి నాలుగో పెళ్లికి సిద్ధమైంది ఒక మహిళ. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన హత్య కేసును పోలీసులు చేధించారు. నాలుగో పెళ్లి చేసుకోబోతున్న ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.
Woman Killed third Husband: అప్పటికే పెళ్లి జరిగింది. ఒకటి కాదు రెండు. ఇద్దరు భర్తలను వదిలేసి మరి మూడో పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మూడో భర్తను చంపి నాలుగో పెళ్లికి సిద్ధమైంది ఒక మహిళ. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన హత్య కేసును పోలీసులు చేధించారు. నాలుగో పెళ్లి చేసుకోబోతున్న ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ లో యూపీకి చెందిన యువకుడు అనుమానస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు తాజాగా ఈ హత్య కేసును చేధించారు. ఈ యువకుడిని అత్తమామలు, భార్య కలిసి హత్య చేసినట్టు విచారణలో గుర్తించారు. మృతుడి భార్య వేరుకరతితో సంబంధం పెట్టుకుందనీ, అతని వివాహం చేసుకోవడానికి హత్యకు పాల్పడిందని మృతుని కుటుంబ సభ్యులు సైతం అంతకుముందు ఆరోపించారు.
పోలీసులు ఈ కేసును గురించి వివరిస్తూ.. మృతుడు సుభాష్ కు , అస్మెరి ఖాతూన్ ఉరఫ్ మంజుదేవికి రెండెండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. వారిని వదిలేసి మూడో పెళ్లి చేసుకుంది. ఇటీవల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మృతుడు సుభాష్ భార్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించాడు. అయినా మారకపోవడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. నాలుగో పెళ్లి విషయం తెలియడంతో ఆమెను దూషించాడనీ, దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మృతుని సోదరుడు తెలిపాడు. ఈ క్రమంలోనే వారు ఆ యువకుడి హత్య చేశారు.
పోలీసులు మాట్లాడుతూ.. వీరికి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగిందని తెలిపారు. మృతుడు సుభాష్ తాగుడుకు బానిస అయ్యాడనీ, నిత్యం భారత్యతో ఏదోఒక విషయంపై గొడవపడుతుండేవాడని అన్నారు. ఇదే హత్యకు దారితీసిందని తెలిపారు. హత్యలో భాగమైన మృతుని భార్య, అత్తమామలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.