యూపీలోని కౌశాంబి జిల్లాలో దారుణం జరిగింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై, ఆ తరువాత తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబిలో ఓ అమానుష్య ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తాంత్రికుడి ఇంటి వద్దే విషం తాగి తన జీవితాన్ని ముగించుకుంది. భూతవైద్యం ద్వారా తన వ్యాధిని నయం చేస్తానని కపట తాంత్రికుడు తన మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో ఆ తాంత్రికుడి దృష్టి తన కూతురిపై పడిందనీ, దీంతో తన కూతురిని బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడు తాంత్రికుడిపై పిప్రి పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది. ఈ క్రమంలో పురుగుల మందు తాగి.. ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్లే.. ప్రయాగ్‌రాజ్‌లోని పూరముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ బిహ్రా గ్రామానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది. ఎన్నో చికిత్సలు చేసినా వ్యాధి నయం కాలేదు. అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపూర్ పురైని గ్రామానికి చెందిన తాంత్రికుడి గురించి బంధువు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మహిళ తన కూతురు కలిసి తన భర్తను నిజాంపూర్ పురైని గ్రామంలోని తాంత్రిక్ రాజు ఇంటికి తీసుకవచ్చారు.
అతడ్ని చూసిన తాంత్రికుడు రాజు భూతవైద్యం ద్వారా వ్యాధిని నయం చేస్తారని పేర్కొన్నారు. వ్యాధిని నయం చేసే పేరుతో కుటుంబ సభ్యులను చాలా రోజులుగా తాంత్రికుడు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఈ సమయంలో తాంత్రికుడి కన్ను సదరు మహిళపై పడింది. ఆమెను ప్రలోభాలకు గురి చేసి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలా ఆమె పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో కపట తాంత్రికుడి కన్ను ఆ మహిళ కుమార్తె పై పడింది.
ఈ క్రమంలో జూన్ 17న 15 ఏళ్ల మైనర్ బాలికను మభ్యపెట్టి తీసుకెళ్లారు. మరోచోట బందీగా ఉంచి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులను కూడా కలవడానికి తాంత్రికుడు అమ్మాయిని అనుమతించలేదు. నిందితుడు తాంత్రిక్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు తాంత్రికుడిని సంప్రదించలేకపోయారు. తనకు న్యాయం చేయాలని మహిళ పోలీసులను ఆశ్రయించింది. జూన్ 19న నిందితులు తాంత్రిక్ రాజు, ముగ్గురు సోదరులు విజయ్, అమర్, సురేంద్రలపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ మహిళ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిందితుడు తాంత్రిక్ ఇంటికి చేరుకుని తన కూతురిని తనకు అప్పజెప్పాలని డిమాండ్ చేసింది. తాంత్రికుడి ఇంటి ముందు బైటాయించింది. దీంతో తాంత్రికుడి బంధువులు మహిళపై వేధింపులకు దిగారు. తాంత్రికుడు కూడా మహిళను దుర్భాషలాడుతూ బెదిరించాడు. ఈ క్రమంలో ఆ మహిళ తాంత్రికుడి ఇంటి ముందే విషం తాగింది.
కుటుంబసభ్యులు మహిళను తాంత్రిక్ ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే మహిళ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ విషం తాగి మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సమర్ బహదూర్ సింగ్ తెలిపారు. విచారణలో మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.ఆమె అనారోగ్యం సమయంలో ఆ మహిళతో పాటు తన మైనర్ కూతురుపై తాంత్రికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
