భార్యభర్తలిద్దరూ ఓ భారీ గోనె సంచిని ఆదివారం ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్లడం వారి పొరుగు వ్యక్తి గమనించాడు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో.., ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

తల్లి లాంటి అత్తను ఓ కోడలు దారుణంగా చంపేసింది. అత్తతో ఓ విషయంలో గొడవ పడి.. చివరకు ఇంట్లోనే చంపేసింది. అత్తను చంపేందుకు.. ఆమెకు భర్త సహాయం చేయడం గమనార్హం. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి దూరంగా పారేయాలని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగి.. పపోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటణ పూణే సమీపంలోని తాలెగావ్ దభడేలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బేబీ గౌతమ్ షిండే(50)కుమారుడు మిలింద్ గౌతమ్ షిండేతో పూజ మిలింద్ షిండే(22)కు వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ ఓ భారీ గోనె సంచిని ఆదివారం ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్లడం వారి పొరుగు వ్యక్తి గమనించాడు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో.., ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాలనీలోని సీసీ టీవీల్లో రికార్డయిన దృశ్యాలను సేకరించారు. నిందితులిద్దరూ ఓ గోనె సంచిని తమ ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్లడం అందులో రికార్డు అయ్యింది. ఆ తర్వాత సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో శవాన్ని పోలీసులు గుర్తించారు.

నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పూజ, ఆమె అత్త మధ్య పెద్ద గొడవ జరిగింది. అనంతరం తన అత్త గొంతుకు జాకెట్ ను గట్టిగా బిగించి పూజ ఆమెను హత్య చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇంటి మిద్దె పైన ఉంచారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో.. భర్త సాయంతో శవాన్ని బయటకు తరలించి చెట్ల పొదల్లో పడేసినట్లు నిందితురాలు నిజం అంగీకరించింది.