ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. ఓ కుమార్తె కూడా ఉంది. కానీ.. వాళ్లని కాదునుకోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. పథకం ప్రకారం ప్రియుడిని అతి దారుణంగా హత్య చేసింది. అందరినీ తన భర్తది సహజమరణం అనే నమ్మించింది. అయితే.. ఆమె కూతురు నోరు తెరవడంతో.. విషయమంతా బయటపడింది. ఈ సంఘటన ఖరగ్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖరగ్ పూర్ లోని పట్టణ నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం. ఈశ్వరరావు(44) ఈ నెల 22న మృతి చెందాడు. ఆయన గుండెపోటుతో మృతి చెందాడని.. సాధారణ మరణం అని అంతా భావించారు.  దీంతో.. కార్యక్రమాలు కూడా జరిపించారు.

అయితే.. తన తండ్రి గుండెపోటుతో మరణించలేదని.. తన తల్లే చంపేసిందంటూ ఈశ్వరరరావు కుమార్తె.. తన పెద్దనాన్న వద్ద వాపోయింది. దీంతో కంగుతిన్న ఈశ్వరరావు సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈశ్వరరావు భార్యను తమదైన శైలిలో విచారించారు.

దీంతో.. ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరిచింది. ప్రియుడితో కలిసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు చెప్పారు. అయితే.. వాళ్లు ఈశ్వరరావును చంపుతుండగా కూతురు చూసింది. అయితే.. వెంటనే ఆ విషయాన్ని బయటపెట్టడానికి భయమేసి.. తర్వాత తన పెదనాన్నకు చెప్పింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.