రోజు రోజుకీ మానవ సంబంధాలు చాలా దారుణంగా మారిపోతున్నాయి. చాలా మంది అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడుతూ కాపురాలు కూల్చుకుంటున్నారు. మరికొందరైతే దారుణాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న వారికే అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి చోటుచేసుకుంది.

ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని.. ఓ మహిళ భర్తను చంపేసింది. భర్తకి నిద్రమాత్రలిచ్చి.. కరెంట్ షాకిచ్చి చంపేసింది. అనంతరం షాక్‌తో చనిపోయాడంటూ డ్రామాలాడింది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాడ్‌మేర్ జిల్లాలోని దీనాగఢ్ ఏరియాకి చెందిన వ్యక్తి(35) భార్య(30) ఉంది. అయితే.. కొద్ది రోజుల క్రితం సదరు వ్యక్తి భార్యకు మరో యువకుడు పరిచయం అయ్యాడు. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది. ఇద్దరూ చాలా కాలం విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. కామక్రీడలు సాగించారు.

అనుకోకుండా ఓ రోజు ఇద్దరి అక్రమ సంబంధం వ్యవహారం భర్తకి తెలిసిపోయింది. దీంతో తమ రాసలీలలకు భర్తని అడ్డుగా భావించిన దుర్మార్గులు అంతమొందించేందుకు నిర్ణయించుకున్నారు. భర్తని హత్య చేసేందుకు ప్రియుడితో కలసి పక్కాగా ప్లాన్ చేసింది. భర్తకి నిద్రమాత్రలిచ్చి పడుకోబెట్టింది. అనంతరం కరెంట్ షాకిచ్చి కిరాతకంగా చంపేసింది. కరెంట్ లైవ్ వైర్‌ని తెచ్చి కాలికి గట్టిగా అంటించి పెట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

అనంతరం తన భర్తకు కరెంట్ షాక్ కొట్టిందని.. చనిపోయాడంటూ అందరినీ పిలిచి హైడ్రామాలు ఆడింది. నిజమేనని నమ్మేసిన బంధువులు అంత్యక్రియలు కూడా జరిపించేశారు. అయితే మృతుడి కాలికి రక్తం ఉండడంతో అతని సోదరుడికి అనుమానం కలిగింది. ఇదే విషయం అతను పోలీసులకు చెప్పాడు. 

దీంతో.. వారు సదరు వ్యక్తి భార్యను తమదైన శైలిలో విచారంగా... దర్యాప్తులో అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. తానే హత్య చేశానంటూ ఆమె అంగీకరించడం గమనార్హం.