ఎరోడ్: తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసి పారిపోయింది. సోమవారంనాడు తమిళనాడులోని ఎరోడ్ జిల్లా అంధియూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తల గొడవ పడ్డారు. ఈ గొడవలో భార్య భర్తను చంపింది. పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిందితురాలిని ఎఫ్ మథలాయీ మేరి (40)గా గుర్తించారు. ఆమె అధియైూరు సమీపంలోని నాగలూరు గ్రామానికి చెందిన ఏ ఫ్రాన్సిస్ జేవియర్ (44) అనే వ్యక్తిని 22 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. వారికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

ఫ్రాన్సిస్ కూలీగా పనిచేస్తుండేవాడు. అయితే, తరుచుగా మద్యం సేవించి భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. దాంతో భర్తతో విడిపోవాలని మథలాయి కొన్నేళ్ల క్రితం నిర్ణయించుకుంది. నలుగురు పిల్లలను తీసుకుని తన తండ్రి వద్దకు వచ్చింది. 

సోమావరం ఉదయం జేవియర్ తన భార్యను కలవడానికి అత్తారింటికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. గొడవలో అకస్మాత్తుగా భార్య రాయి తీసుకుని ఫ్రాన్సిస్ తలపై కొట్టింది. దాంతో జేవియర్ అక్కడికక్కడే మరణించాడు.