జోథ్ పూర్: రాజస్థాన్ లో దిగ్భ్రాంతికరమైన హత్య సంఘటన వెలుగు చూసింది.  ఓ యువకుడి శరీర భాగాలు జోథ్ పూర్ లోని సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ సమీపంలో తేలుతున్న విషయాన్ని పోలీసులు ఆగస్టు 12వ తేదీన గుర్తించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. 

మృతుడిని భార్యను, ఆమె ఇద్దరు సిస్టర్స్ ను, వారి కామన్ ఫ్రెండ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నంందాడి ట్రీట్ మెంట్ ప్లాంట్ సమీపంలో విడివిడి సీవరేజ్ లైన్లలో మానవ శరీర భాగాలతో తేలుతున్న బాక్స్ లను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు దర్యాప్తు సాగించారు. 

పోలీసులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన వ్యక్తుల వివరాలను సేకరించారు. వారి విచారణలో సుశీల్ అలియాస్ చరణ్ సింగ్ చౌదరి అదృశ్యమైనట్లు తేలింది. ఘటనా స్థలంలో మృతుడిని బైక్ కనిపించింది. 

ఇద్దరు అమ్మాయిలు వచ్చిన బైక్ ను తీసుకొచ్చి అక్కడ పార్క్ చేశారని పోలీసులు గుర్తించారు. అనుమానంతో పోలీసులు మృతుడి భార్యను, ఆమె చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. కొన్నేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ వారి మధ్య సయోధ్య కుదరలేదని తెలిసింది. 

చరణ్ సింగ్ ను హత్య చేసినట్లు ఎట్టకేలకు నిందితులు అంగీకరించారు. చరణ్ సింగ్ ను ఇంట్లోనే చంపి, శవాన్ని ముక్కులు చేసిన మురుగు కాలువలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.