ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది. భర్తకు దూరంగా కూతురిని తీసుకొని ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. అయితే... ప్రియుడితో ఆనందంగా గడిపేందుకు ఆమె కూతురు అడ్డుగా కనపడింది. అంతే.. కూతురనే కనికరం లేకుండా.. ఆమెను కూడా  చంపేసింది. ఈ సంఘటన రాజస్తాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జైపూర్ కి చెందిన సుమిత్ అహిర్, టీనా భార్యభర్తలు. వీరిని నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్ లో ఒకరోజు టీనా, నాలుగేళ్ల కుమార్తె కనిపించకుండా పోయారు. దీంతో... వెంటనే వారిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. తీరా.. ఇటీవల టీనా.. ఆమె ప్రియుడితో కలిసి పోలీసులకు చిక్కింది. కుమార్తె గురించి ఆరా తీయగా.. తాత గారి ఇంట్లో ఉందని అబద్దం చెప్పింది. అయితే.. అక్కడ ఆరా తీయగా.. అసలు పాపను అక్కడకు తీసుకురాలేదని తెలిసింది.

దీంతో పోలీసులు టీనాని గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపెట్టింది. డిసెంబర్‌ 8, 2020లో టీనా కూతురు ఆడుకుంటూ మెట్ల మీద నుంచి కిందపడిపోయి, తీవ్రగాయాలపాలైంది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, పాప పరిస్థితి బాగాలేదని జైపూర్‌ సిటీకి వెళ్లమని చెప్పారు వైద్యులు. అయితే, సహాయ్‌ పాప వైద్యానికి అయ్యే ఖర్చును భరించడానికి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యంలో తల్లి టీనా, ఆమె ప్రియుడు ప్రహ్లాద్‌ సహాయ్‌ పాపను చంపి అక్కడికి దగ్గరలోని అడవిలో పరేశారు.