భర్తకు తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏకంగా ప్రియుడిని ఇంటికే రప్పించుకుంది. ప్రియుడితో కలిసి సరసాలు ఆడుతుండగా... వారిద్దరినీ ఆమె అత్త చూసేసింది. ఇంకేముంది.. ఎక్కడ అత్త కారణంగా తమ రహస్య బంధం బయటపడిపోతుందనే భయంతో... ప్రియుడితో కలిసి హత్య చేసేసింది. ఈ దారుణ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం  బ్యాటరాయనపుర ప్రాంతానికి చెందిన రాజమ్మ(60)కి  కుమార్ అనే కొడుకు ఉన్నాడు. ఒక్కగానొక్క కొడుకుకి ఇటీవల ఆమె  సౌందర్య అనే యువతిని ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించింది. ఆమె తన శేష జీవితాన్ని కొడుకు,కోడలితో కలిసి గడిపేస్తోంది.

Also Read ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు పిసికి చంపిన భార్య.

కాగా.. ఇటీవల కోడలు సౌందర్య  లైన్ మెన్ నవీన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ ఒకే గదిలో ఉండగా.. ఒకరోజు అత్త రాజమ్మ చూసేసింది. దీనితో కోడలు సౌందర్యను మందలించింది.ఈ విషయాన్ని భర్త కుమార్‌తో చెప్పి పంచాయతి పెడతానంటూ హెచ్చరించింది. 

దీంతో తమ బండారం బయటపడుతుందని భయపడిన సౌందర్య ప్రియుడు నవీన్‌తో కలిసి రాజమ్మ తలపై రాడ్‌తో బాదడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. సౌందర్య ఏమీ తెలియనట్లు పక్కింటికి వెళ్లగా, నవీన్‌ అక్కడ నుండి జారుకున్నాడు.  

పక్కింటికి వెళ్లిన సౌందర్య గంట తర్వాత ఇంటికి చేరుకుంది. అప్పటికే అత్త చనిపోయిందని నిర్థారించుకున్నాక... ఎవరో వచ్చి తన అత్తను చంపేశారంటూ ప్లాన్ వేసింది. అందరూ అదే నిజమని నమ్మారు. అయితే.. విచారణలో పోలీసులకు సౌందర్యపై అనుమానం కలిగింది.  అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టింది.

సౌందర్య, ఆమె ప్రియుడు నవీన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.