మహారాష్ట్రలోని రాయ్ గఢ్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఆరుగురు పిల్లల్ని బావిలోకి తోసేసి చంపేసింది. ఆ తరువాత తానూ బావిలో దూకింది.
మహారాష్ట్ర : ఇటివలి కాలంలో క్షణికావేశంలో suicideలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాము చనిపోవడమే కాదు.. అభం, శుభం తెలియని చిన్నారులను సైతం ఉసురు తీస్తున్నారు. అలాగే ఓ woman ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా six childrenని బావిలో పడేసి చంపేసింది. ఆ తరువాత తానూ suicide attempt చేసింది. అయితే ఆమె బతికి బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.
మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో ఐదుగురు బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకా లోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టిందని తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఘటనే ఏప్రిల్ 26న తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాలలో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే అనుమానంతో ఓ చిన్నారి ఉసురు తీశాడు. భార్య మీద అనుమానంతో కడుపున పుట్టిన కొడుకునే 11నెలల చిన్నారిని పాశవికంగా నేలకేసి కొట్టాడు. పట్టరాని కోపంలో చేసిన ఆ పనితో ఆ పసివాడికి నూరేళ్లు నిండాయి.
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయి భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులిమడుగు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మందమర్రి మండలం pulimaduguకు చెందిన నరేష్, జ్యోతి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 11నెలల బాబు ఉన్నాడు. నరేష్ ఇసుక బట్టిలో పనిచేస్తాడు. అయితే, ఈ క్రమంలో తన భార్య జ్యోతిపై అనుమానపడుతుండేవాడు. దీంతో ఇంట్లో ఆమెతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు.
అదే సమయంలో ఆదివారం అర్ధరాత్రి తాగి వచ్చిన నరేష్ భార్యతో మల్లోసారి ఘర్షణ పడ్డాడు. ఇష్టానుసారం కొడుతూ భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి బాదాడు. అనుకోని ఈ పరిణామానికి భార్య తేరుకునేలోపే.. చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూసాడు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, భర్తతో గొడవపడి ఓ మహిళ తన మూడు నెలల పసికందును గొంతు కోసి murder చేసిన ఘటన న్యూ ఢిల్లీలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు ఏప్రిల్ 6న వివరాలు వెల్లడించారు. వాయువ్య ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన నిందితురాలు అంజలీ దేవి(26)ని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2.14 గంటలకు పసికందును ఆమె తల్లి హత్య చేసినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ తన మెడలోని దారంతో శిశువు గొంతుకు బిగించి చంపినట్లు తెలిసింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగాని తెలిపారు.
