కొడుకు ప్రేమించాడు అనగానే సంతోషంగా పెళ్లి చేసింది. కానీ కోడలిపై మాత్ర ద్వేషం పెంచుకుంది.... వాళ్లకు పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. అయితే.... ఈ ఐదు సంవ్సతరాలలో ఆమెకు కోడలిపై కోపం రోజు రోజుకీ పెరిగిపోయింది. చివరకు సమయం చూసుకొని..భర్త, కొడుకు ఇంట్లో లేని సమయం చూసి కోడలిని చంపేసింది. అనంతరం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అయ్యింది. ఎందుకు చంపావు అని అడగగా... ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మహారాష్ట్రలోని వసాయి ప్రాంతానికి చెందిన ఆనంది(48)కి భార్య, కొడుకు రోహన్(33) ఉన్నాడు. ఐదు సంవత్సరాల క్రితం రోహన్ రియా(33) అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఐదేళ్ల క్రితమే పెళ్లైంది. అయితే... రియాకి అమెరికాలోని టెక్సాస్ లో నర్స్ గా ఉద్యోగం వచ్చింది.

దీంతో... రోహన్, రియా అమెరికా వెళ్లిపోయారు. కోడలు కారణంగానే తన కొడుకు తనకు దూరమయ్యాడని ఆనంది బాధపడేది. ఉద్యోగం మానుకోమని... రియా అన్న పేరు కూడా బాలేదని మార్చుకోమని ఆనంది చాలా సార్లు కోడలిని కోరింది. అందుకు  ఆమె అంగీకరించలేదు. దీంతో... కోపం పెంచుకుంది. ఇటీవల రియాకు పాప కూడా పుట్టింది. ప్రస్తుతం పాపకు ఆరు నెలలు కాగా... డిసెంబర్ 1వ తేదీన రియా దంపతులు పాపతో సహా ఇండియా వచ్చారు.

ఓ శుభకార్యం కోసం వారు ఇండియా రాగా... త్వరలోనే అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే... రియా తనను మనవరాలిని కూడా ఎత్తుకోనివ్వడం లేదని ఆనంది బాధపడేంది. ఈ క్రమంలో ఆమెకు కోడలిపైన విపరీతమైన ధ్వేషం పెరిగిపోయింది. ఆదివారం ఉదయం తన భర్త, రోహన్ మార్నింగ్ వాక్‌కు వెళ్లగానే కోడలి గదిలోకి వెళ్లి పక్కనే ఉన్న ఫ్లవర్‌వాజ్‌తో ఆమె తలపై బలంగా మోదినట్లు నిందితురాలు ఆనంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన సందర్భంలో చెప్పింది. 

ఆమె చెప్పిన వెంటనే ఇంటికి వెళ్లిన పోలీసులు తీవ్ర రక్తస్రావంతో రియా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ఆనందిని అదుపులోకి తీసుకున్నారు. రియా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.