Surat: ప్రియుడి మోజులో పడ్డ ఒక మహిళ తన రెండేళ్ల కుమారుడిని చంపింది. ఆ తర్వాత ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు 'దృశ్యం' సినిమా తరహాలో ప్లాన్ వేసింది. కానీ చివరకి పట్టుపడటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
kills 2-year-old son for lover in Surat: ప్రియుడి మోజులో పడ్డ ఒక మహిళ తన రెండేళ్ల కుమారుడిని చంపింది. ఆ తర్వాత ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు 'దృశ్యం' సినిమా తరహాలో ప్లాన్ వేసింది. కానీ చివరకి పట్టుపడటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. మహిళ అనుమానస్పదంగా ఉండటం, పొంతనలేని సమాధానాల క్రమంలో పోలీసు విచారణలో ఈ నేరం చేసిన విషయాలు వెల్లడించింది.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ లోని సూరత్ జిల్లాలో ఓ మహిళ తన రెండున్నరేళ్ల చిన్నారిని చంపి తన బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజులుగా తప్పిపోయిన చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. తప్పిపోయిన తన బిడ్డ ఆచూకీ కోసం పోలీసులతో కలిసి గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై మరింత లోతుగా పోలీసులు ఆరా తీయడంతో చిన్నారి తల్లి అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా.. అసలు విషయం బయటపడింది.
సూరత్ లోని దిండోలీ ప్రాంతంలోని ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తున్న నయన మాండవి తన రెండున్నరేళ్ల చిన్నారి వీర్ మాండవి కనిపించకుండా పోయిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. మహిళ పని చేస్తున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చిన్నారి బయటకు రాలేదు. దీని ఆధారంగా చిన్నారి అక్కడి నుంచి వెళ్లలేదని నిర్ధారణకు వచ్చారు. చిన్నారి అదృశ్యంపై పోలీసులు మహిళను విస్తృతంగా ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. తప్పిపోయిన చిన్నారి కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్ ను కూడా ఉపయోగించారు. కానీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ప్రియుడిపై కిడ్నాప్ ఆరోపణలు..
జార్ఖండ్ లో నివసిస్తున్న తన ప్రియుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. పోలీసులు ఆమె ప్రియుడిని సంప్రదించినప్పటికీ సూరత్ సమీపంలో అతని ఆచూకీ లభించలేదు. తానెప్పుడూ సూరత్ వెళ్లలేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అన్ని విధాల విచారణలు జరపగా ఎలాంటి ఆధారమూ లభించలేదు. దీంతో మరోసారి చిన్నారి తప్పిపోయిన వివరాలు అడిగారు. ఆమె చెబుతున్న వివరాలతో అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన తరహాలో విచారణ జరిపడంతో చేసిన నేరాన్ని మహిళ ఒప్పుకుంది. విచారణలో చివరకు తన బిడ్డను తానే చంపినట్టు ఒప్పుకుంది. అయితే శవం ఎక్కడ ఉంచారనే విరాలు అడగ్గా మొదట తప్పుడు వివరాలు చెప్పింది.
తొలుత మృతదేహాన్ని గుంతలో పూడ్చిపెట్టానని చెప్పింది. అయితే ఆ స్థలాన్ని తవ్వి చూడగా ఏమీ కనిపించలేదని బాధితురాలు వాపోయింది. మృతదేహాన్ని చెరువులో పడేశానని ఆమె పోలీసులకు చెప్పినా అక్కడ కూడా ఏమీ దొరకలేదు. అయితే, మహిళను మరోసారి విచారించగా మృతదేహాన్ని నిర్మాణ స్థలంలోని మరుగుదొడ్డి కోసం ఉద్దేశించిన గుంతలో పడేసినట్లు వెల్లడించింది. ఆ ప్రదేశం నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
ఆ మహిళ తన కుమారుడిని ఎందుకు చంపింది?
తన బిడ్డను ఎందుకు చంపిందనే విషయం గురించి మహిళ చెప్పిన విషయాలు విని అందరూ షాక్ అయ్యారు. తాను జార్ఖండ్ కు వాసిననీ, అక్కడ తనకు ఒక ప్రేమికుడు ఉన్నాడని వివరించింది. తన బిడ్డతో వస్తే ఒప్పుకోనని చెప్పాడనీ, అందుకే తన ప్రియుడి కోసం కుమారుడిని చంపినట్టు తెలిపింది. హత్య చేసిన తర్వాత శవం దాచిపెట్టడానికి, నేరం నుంచి తప్పించుకోవడానికి దృశ్యం సినిమా చూసినట్టు తెలిపింది.