చెన్నై: తమిళనాడులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడితో ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. కల్లకురిచ్చి సమీపంలో శుక్రవారం ఆ మహిళ హత్యకు గురైంది. 

కచ్చిరాయపాళయం అమ్మాపేట గ్రామానికి చెందిన మనోహర్ (45), సంగీత (35) దంపతులకు సురేష్, గోకుల్ అనే కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితం మనోహర్ అనారోగ్యంతో మరణించాడు. సంగీత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. 

శుక్రవారం ఉదయం బలరామ్ పట్ట బస్టాండ్ సమీపంోలని మట్టపారై వెళ్లే రోడ్డులో ఆమె శవమై కనిపించింది. శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న కల్లకురిచ్చి డీఎస్పీ రామనాథన్, కచ్చిరాయపాళయం పోలీసు ఇన్ స్పెక్టర్ రామ్ రాజు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సంగీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. 

అత్తియూరుకు చెందిన యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ తగాదాలో ఆమె హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.