Asianet News TeluguAsianet News Telugu

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణం.. వీధి కుక్క‌ల దాడిలో మహిళ మృతి

ఇటీవల కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. రోడ్ల వెంట ఒంటరిగా వెళ్లే వ్యక్తులపై దాడిలు చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ జిల్లాలో ఓ మహిళను కుక్కలు తీవ్రంగా కరిచాయి. దీంతో ఆమెను హాస్పిట‌ల్ కు తీసుకెళ్లే క్ర‌మంలోనే మృతి చెందారు.

Woman killed in street dog attack in Uttar Pradesh
Author
Amroha, First Published Jan 27, 2022, 10:00 AM IST

ఉత్తరప్రదేశ్ (utharapradhesh) దారుణం జరిగింది. ఓ మ‌హిళపై వీధి కుక్క‌లు (street dogs)  దాడి చేశాయి. దీంతో ఆమె తీవ్ర‌గాయాల‌పాలైంది. స్థానికులు వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లాల‌ని భావించారు. కానీ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లే క్ర‌మంలోనే ఆమె మృతి చెందారు. ఈ ఘ‌ట‌న అమ్రోహా (amroha) జిల్లాలోని హసన్‌పూర్ (hasanpur)పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్‌నౌరా (biznoura)గ్రామంలో సోమ‌వారం సాయంత్రం జ‌రిగింది. 

బిజ్ నౌరా గ్రామానికి చెందిన 30 ఏళ్ల నథియా (nathiya) సోమవారం సాయంత్రం పశువులకు మేత వేసి ఇంటికి తిరిగి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆమెపై వీధి కుక్కలు ఆమెపై ఎగ‌బ‌డ్డాయి. వాటి బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఆమె ఎంతో ప్ర‌య‌త్నం చేసినా అవేవీ ఫ‌లించ‌లేదు. కుక్క‌లు విప‌రీతంగా రెచ్చిపోయి ఆమెను తీవ్రంగా క‌రిచాయి. ఆమె ముఖం, గొంతు, కడుపుపై ​​గాయాలు చేశాయి. దీనిని గ‌మ‌నించిన స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. కానీ ఆలోపే మహిళ స్పృహ కోల్పోయింది. హాస్పిట‌ల్ కు తరలించే మార్గంలో ఆమె మరణించింది.

ఈ నెల మొద‌ట్లో మ‌ధ్య ప్ర‌దేశ్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. భోపాల్‌ (bopal)లోని అంజలి విహార్ కాలనీ (anjali vihar colony) లో నాలుగేళ్ల బాలిక‌పై కుక్కల తీవ్రంగా దాడి చేశాయి. దీంతో పాప గాయాల‌పాలైంది. గాయపడిన బాలికను చికిత్స కోసం వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. ఈ భయానక దాడి సీసీటీవీ (cctv)కెమెరాలో రికార్డయింది. ఇందులో దృష్యాలు అంద‌రినీ క‌లిచివేశాయి. ఈ దాడిలో ఐదు కుక్కలు పాప‌ను వెంబడించినట్లు క‌నిపించాయి. పాపపై కుక్క‌లు దాడి చేస్తున్నాయ‌నుకున్న క్ర‌మంలోనే ఆమె భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ బ్యాలెన్స్ (balence) తప్పి కింద పడిపోయింది. ఆ తర్వాత కుక్కలు ఆమెను చుట్టుముట్టి క‌ర‌వ‌డం ప్రారంభించాయి. దీనిని గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి తరువాత కుక్కలను తరిమికొట్టాడు. 

సహరాన్‌పూర్ (saharanpur) జిల్లాలోని మిర్జాపూర్ (mirjapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడ్లీ గ్రాంట్ గ్రామంలో మరో ఘటనలో వీధికుక్కల గుంపు 12 ఏళ్ల బాలుడిని క‌రిచాయి. దీంతో ఆ పిల్లాడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం స్థానికులు ఆ ప్రాంతంలో వీధికుక్కల బెడదపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా, గత శనివారం మధ్యప్రదేశ్‌ (madya pradhesh)లోని ఇండోర్‌ (indor)లో వీధికుక్కను ఓ వ్య‌క్తి క‌త్తితో పొడిచి చంపాడు. దీంతో అత‌డిపై పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. నిందితుడిని ఇండోర్‌లోని భగీరథ్‌పురా ప్రాంతానికి చెందిన రాజేంద్రగా గుర్తించారు. ఆయ‌న న‌డుకుంటూ వెళ్తూ ప్ర‌శాంతంగా నిద్రిస్తున్న ఓ వీధి కుక్క కడుపులో కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న‌ను కొంత మంది స్థానికులు, జంతు ప్రేమికులు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత‌డిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios