Asianet News TeluguAsianet News Telugu

వృద్ధురాలిని చంపి, ముక్కలుగా కోసి, గోనెసంచిలో కట్టి నదిలోకి.. కొడుకు, మనవడు అరెస్ట్..

మహారాష్ట్రలోని పూణెలోని ముఠా నది ఒడ్డున తేర్ సమీపంలో ఆగస్ట్ 23న ఓ మనిషి శరీర భాగం తేలుతూ కనిపించింది. ఇది చూసిన వారిని భయాందోళనలకు గురి చేసింది. 

Woman Killed By Son, Grandson and Body Mutilated Dumped Into River in Pune
Author
First Published Sep 7, 2022, 8:13 AM IST

పూణె : మహారాష్ట్రలోని పూణెలో దారుణం చోటు చేసుకుంది. ఆగస్ట్ 23న పూణెలోని తేర్ సమీపంలోని ముఠా నది ఒడ్డున  ఓ మనిషి శరీర భాగం నదిలో తేలుతూ కనిపించింది. దీనిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో...వారు వచ్చి.. ఆ శరీరభాగాన్ని సేకరించారు. గాలింపు చేపట్టడా.. నదిలో గోనె సంచిలో కుక్కి పడేసిన మిగతా శరీర భాగాలు కూడా దొరికాయి. అవి 62 ఏళ్ల వృద్ధురాలి శరీరభాగాలుగా, ఆమెను హత్య చేసినట్టుగా పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన గతనెలలో వెలుగులోకి రాగా ఈ కేసును పుణె పోలీసులు తాజాగా ఛేదించారు. 

ఆమె హత్య కేసులో కొడుకు, మనవడిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. బాధితురాలి కుమారుడు సందీప్ గైక్వాడ్, ఆమె మనవడు సాహిల్‌గా నిందితులను గుర్తించాడు. బాధితురాలు ఉషా గైక్వాడ్‌ వారిద్దరినీ తనింట్లోనుంచి వెళ్లమన్నందుకు కోపంతో ఈ నేరానికి పాల్పడ్డారు. "ఆగస్టు 5న, సాహిల్, సందీప్ ముధ్వా పోలీస్ స్టేషన్‌లో ఉషా గైక్వాడ్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ ఫిర్యాదు చేశారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

కారులో కూర్చున్నవారందరూ సీటు బెల్టు పెట్టుకోవాలి.. లేదంటే ఫైన్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

బాధితురాలి కుమార్తె శీతల్ కాంబ్లే కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఉషా గైక్వాడ్ అదృశ్యం వెనుక తండ్రీకొడుకుల పాత్ర ఉందని ఆయన అన్నారు. సందీప్, సాహిల్‌లను అదుపులోకి తీసుకున్నామని, కేశవ్ నగర్ ప్రాంతంలోని ఇల్లు, బంగారు ఆభరణాలు బాధితురాలి పేరు మీద ఉండటంతో వారు ఆమె మీద ఆగ్రహంతో ఉన్నారని తమ విచారణలో తేలిందని అధికారి తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సాహిల్ మహిళను గొంతుకోసి హత్య చేశాడు. 

ఆ తరువాత ఎలక్ట్రిక్ కట్టర్ మెషీన్‌ని కొనుగోలు చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని గోనె సంచిలో మూటకట్టి నదిలో పడేశాడు అని పోలీసులు తెలిపారు. అలా ఆగస్ట్ 23న ముఠా నది ఒడ్డున తేర్ సమీపంలో అందులోని ఓ శరీర భాగం తేలుతూ కనిపించింది. అలా కేసు వెలుగులోకి వచ్చింది.. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అభియోగాల కింద మృతురాలి కొడుకు, మనవడి మీద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios