దేశ రాజధాని డిల్లీలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఓ దుండగుడు నడిరోడ్డుపై వివాహితపై కత్తితో దాడిచేసి దారుణంగా హతమార్చాడు. వివాహిత 10ఏళ్ల కూతురు ఎదుటే దుండగుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తన తల్లిని చంపొద్దని బాలిక ఎంత వేడుకున్నా కనికరించని దుండగుడు అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీహార్‌లోని మధుబనీ జిల్లాకు చెందిన శ్యామ్ యాదవ్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం డిల్లీకి వలసవచ్చి శివారు ప్రాంతంలో నివాసముంటున్నాడు. అక్కడికి సమీపంలోని ఓ చెప్పుల తయారీ ప్యాక్టరీలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. 

అయితే ఇతడికి అదే చెప్పుల కంపనీలో పనిచేసే 45 ఏళ్ళ మాధురి అనే వివాహితతో పరిచయమైంది. ఈ వివాహిత  మహిళపై వ్యామోహాన్ని పెంచుకున్న శ్యామ్ ఆమెకు పెళ్లయిందని తెలిసి కూడా ప్రేమ పేరుతో వేధించడం ప్రారంబించాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుందామని కూడా ప్రతిపాదించగా అందుకు మాధురి ఒప్పుకోలేదు. నిత్యం అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన మాధుని ఆ కంపనీలో పని మానేసింది. 

అయినా వదిలిపెట్టని శ్యామ్ మాధురిని వదిలిపెట్టలేదు. ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో ఆమెను వెంబడిస్తూ తన ప్రేమను అంగీకరించాలని వేధించేవాడు. ఈ క్రమంలోనే గత బుధవారం మాధురి తన 18ఏళ్ళ కూతురితో కలిసి బయటకు వచ్చింది. దీంతో రోజూ మాదిరిగానే వారి వెంటపడుతూ వచ్చిన శ్యాం కోపంతో మాధురిపై ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. తల్లిని వదిలిపెట్టాలని  మాధురి కూతురు ఎంత వేడుకున్నా అతడు కనికరించలేడు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై కర్తపుమడుగులో పడిపోయిన మాధురిని కూతురు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర రక్తస్రావమవడంతో మాధురి చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. 

మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. డిల్లీ వదిలి పారిపోతున్న శ్యాంను పట్టుకుని కటకటాల్లో వేశారు. వివాహిత మహిళ పట్లు అమానుషంగా ప్రవర్తించిన అతడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.