. ఆ సమయంలో.. అతని స్నేహితులు కారులో వచ్చి.. ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్ లోని ఓ గదిలో నిర్భందించారు. అనంతరం పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు,
తెలిసిన వ్యక్తే... స్నేహితులతో కలిసి ఓ వివాహితను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించి... దాదాపు తొమ్మిది రోజులపాటు నరకం చూపించారు. ఒకరి తర్వాత ఒకరు ఆమె అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. తెలివిగా వారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత(20) గత నెల 30వ తేదీన తనకు పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతోంది. ఆ సమయంలో.. అతని స్నేహితులు కారులో వచ్చి.. ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్ లోని ఓ గదిలో నిర్భందించారు. అనంతరం పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు,
తొమ్మిది రోజుల తర్వాత దుండగుల నుంచి ఆమె తప్పించుకొని భల్లబ్ గఢ్ బస్ స్టేషన్ కి చేరుకుంది. అక్కడి నుంచి తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసింది. వారి సహాయంతో ఇంటికి చేరిన బాధితురాలు.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
