అన్న అంటే.. అమ్మ, నాన్నల తర్వాత అంతటివాడు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటూ నాన్నతో సమానం. అలాంటి అన్నతో సొంత చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకుంది. కనీసం వావి వరసలు కూడా పాటించకుండా నీచంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగలేదు.. తమ కామక్రీడకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతనిని అంతమొందించింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read మరో మహిళతో తండ్రి అక్రమ సంబంధం... తట్టుకోలేని కొడుకు..
ఆగ్రా పరిధిలోని ఖండా గ్రామానికి చెందిన విక్రమ్ ఠాకూర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రవీనా అలియాస్ రాణి, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. 

కరోనా నేపథ్యంలో గత పదిహేను రోజుల కిందట భార్యాపిల్లలతో సహా విక్రమ్ స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో అతని ఇంటికి పక్కనే ఉండే రవీనా అన్న ప్రతాప్ నివాసం ఉంటున్నాడు.

సొంత అన్నా చెల్లెల్లు అయిన రవీనా, ప్రతాప్ లు ఎవరికీ తెలీకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం భర్తకు తెలిసిపోతుందేమో అని భయపడ్డారు. అతని అడ్డు తొలగించుకుంటే తాము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని భావించారు.

ఈ క్రమంలోనే నిద్రపోతున్న విక్రమ్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం రవీనా తనకు ఏమీ తెలీనట్లు.. ఎవరో తన భర్తను హత్య చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే.. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. రవీనాని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతాప్ పరారీలో ఉండగా... ఆచూకీ కోసం గాలిస్తున్నారు.