ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిని కలవడం కోసం.. అతని తమ్ముడైన చిన్నారిని కిడ్నాప్ చేసిందో మహిళ.. ఆరు రోజులుగా పోలీసులు బాలుడి కోసం వెతుకుతుండగా, కిడ్నాప్ చేసిన చిన్నారిని మహిళ తన వద్దే ఉంచుకుంది. వారం రోజుల తరువాత బాలుడి ఆచూకీ దొరకడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ : Uttarpradeshలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో తన ప్రేమికుడిని కలవడానికి ఓ మహిళ మరీ దారుణానికి తెగబడింది. తన nephew సహాయంతో సదరు ప్రేమికుడి 6 ఏళ్ల సోదరుడిని కిడ్నాప్ చేసింది. సదరు 32 ఏళ్ల మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, బాలుడు కనిపించకుండా పోవడంతో ఆరు రోజులుగా పోలీసులు బాలుడి కోసం వెతుకుతున్నారు. కాగా kidnap చేసిన తరువాత ఆ చిన్నారిని మహిళ తన వద్దే ఉంచుకుంది. వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఛతరీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఫిబ్రవరి 15న హిమ్మత్‌గర్హి గ్రామంలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న డోరిలాల్ (6) అనే చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.
దీంతో అంతా వెతికిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్టైంట్ మేరకు కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇదంతా ఆ చిన్నారి అన్నను కలవడానికి అతని ప్రేమికురాలు చేసిన దారుణం అని తేలింది. దీంతో ఆమెతో సహా కిడ్నాప్ కు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, దోరీలాల్ అన్నయ్య అయిన 20 ఏళ్ల హీరాలాల్ కు.. పక్క గ్రామానికి చెందిన పింకీ అనే 32 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం ఉందని తేలిందని ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత, హీరాలాల్ ఉద్యోగం కోసం గుర్గావ్‌కు వెళ్లాడు. దీంతో కొన్ని నెలలపాటు పింకీని కలవలేదు. దీంతో విసిగిపోయిన పింకీ.. తన మేనల్లుడు లవకేష్‌తో కలిసి హీరాలాల్‌ను కలిసేందుకు ఏం చేయాలా? అని ఆలోచించింది. దీనికోసం తన ప్రేమికుడి తమ్ముడు డోరీలాల్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసింది.
ఫిబ్రవరి 15న లవకేష్ చిన్నారిని కిడ్నాప్ చేసి పింకీకి అప్పగించాడు. పింకీ ఆ చిన్నారిని తన దగ్గరే ఉంచుకుని హీరాలాల్‌కి ఫోన్ చేసి అదే విషయాన్ని తెలియజేసింది. అయితే, హీరాలాల్, తన సోదరుడి ఆచూకీ గురించి తెలిసిన తర్వాత కూడా, అతని కుటుంబానికి, పోలీసులకు వాస్తవాన్ని చెప్పకుండా దాచిపెట్టాడు. అయితే, పోలీసులు హీరాలాల్, పింకీల మొబైల్ ఫోన్‌లను ట్రేస్ చేయడంతో, వారిని ట్రాక్ చేయగలిగారు. కాగా ఆ మహిళ తన నేరాన్ని అంగీకరించింది, ఆ తర్వాత పోలీసులు ఆమె మేనల్లుడు, ప్రియుడిని కూడా అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 16న తెలంగాణలోని ఖమ్మంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా బోనకల్ ప్రాంతానికి చెందిన సునీత- హరికృష్ణలకు కొనేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ చదువుకుంటున్నారు. భర్త లారీ, ఆటో డ్రైవర్ గా పని చేస్తుంటాడు. జీవనోపాధిలో భాగంగా వివిధ ప్రాంతాలకు డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాడు. ఇలా తరచూ భర్త బయటకు వెళ్తుండటంతో మామ నర్సింహారావుతో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది దాదాపుగా 5-6 సంవత్సరాలుగా కొనసాగుతోంది.
ఇలా వివాహేత సంబంధం సాగుతున్న క్రమంలో వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉండటం పెద్ద కుమార్తె మహాదేవి (11) చూసింది. అనుకోకుండా చూసిన ఈ దృష్యాలను జీర్ణించుకోలేకపోయిన చిన్నారి.. ఈ విషయాన్ని తండ్రికి చెప్పేస్తానని అంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మామ, కోడళ్లు చిన్నారిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన ఆ చిన్నారిని నోట్లో బట్టలు పెట్టి, మెడపై తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అయితే దీనిని హత్యగా కాకుండా సాధారణ మృతిగా చిత్రీకరించాలని అనుకున్నారు.
అందులో భాగంగానే తన కూతురుకు స్కూళ్లో ఫిట్స్ వచ్చాయని, ఆ సమయంలో మృతి చెందిందని అందరికీ చెప్పింది. అయితే చిన్నారి మెడపై గాయాలు ఉండటాన్ని బంధువులు చూశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపించారు. రిపోర్టులో హత్య అని తేలడంతో మృతురాలి తల్లిని, తాతను విచారించారు. దీంతో తామే ఈ దారుణానికి ఒడిగట్టామని వారు ఒప్పుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.
