తన భర్త పేరు సతీష్ కాగా, పూర్తి పేరు ఆమె నుదిటిపై పచ్చ బొట్టు పొడిపించుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోకి విపరీతంగా వ్యూస్ వచ్చాయి.
జీవిత భాగస్వామిపై ప్రేమ ఉండటం చాలా సహజం. మన జీవితాంతం ఆ వ్యక్తితోనే ఉంటాం కాబట్టి.. సహజంగానే ప్రేమ ఉంటుంది. కొందరు ఆ ప్రేమను చూపించాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం టాటూలు కూడా వేయించుకుంటూ ఉంటారు. భర్త పేరులోని మొదటి అక్షరం లేదంటే పూర్తి పేరును టాటూ వేయించుకున్న వారు చాలా మందే ఉన్నారు.
కానీ ఓ మహిళ ఏకంగా తన భర్త పూర్తి పేరును నుదిటిపై టాటూ వేయించుకుంది. తన భర్త పేరు సతీష్ కాగా, పూర్తి పేరు ఆమె నుదిటిపై పచ్చ బొట్టు పొడిపించుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోకి విపరీతంగా వ్యూస్ వచ్చాయి.
కాగా, ఆమె వీడియోపై నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు. చాలా మంది ఆమె చేసిన పనిని తప్పు పట్టడం గమనార్హం. దానిని ఓవర్ యాక్షన్ అంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా ప్రేమ ఉంటే చేతిమీద టాటూ వేయించుకుంటారు. కానీ ఏకంగా నుదిటిపై వేయించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరేమో అసలు అది నిజమైన టాటూ కాదని, ఆమె చేస్తున్నందతా ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇమె ఇతర వీడియోలు చూస్తుంటే నిజంగానే అది ఫేక్ అనే విషయం తెలుస్తుండటం విశేషం. ఆ వీడియో తర్వాత ఆమె పోస్టు చేసిన చాలా వీడీయెల్లో ఆమె ముఖంపై ఎలాంటి టాటూ లేదు. దీంతో ఆ వీడియో గ్రాఫిక్స్ అని, ఫేక్ అని తెలిసిపోతోంది.
