Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ కోసం అక్రమంగా సరిహద్దులు దాటి.. ప్రియుడి కోసం భారత్‌లోకి బంగ్లాదేశ్ మహిళ , అరెస్ట్

ఓ బంగ్లాదేశ్ మహిళ.. తన ప్రియుడి కోసం సరిహద్దు దాటి అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టింది. ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Woman From Bangladesh Arrested For Illegally Entering India To Marry Lover ksp
Author
First Published Oct 27, 2023, 3:38 PM IST

ప్రేమించిన వారి కోసం దేశాలను, ఖండాలను దాటుతున్న వారి సంఖ్య నేడు ఎక్కువవుతోంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ భార్యాబిడ్డలను వదిలేసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రియుడికి చెంతకు చేరింది. అలాగే రాజస్థాన్‌కు చెందిన చెందిన ఓ వివాహిత సైతం తన ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడేందుకు పాకిస్తాన్ వెళ్లింది. తాజాగా ఓ బంగ్లాదేశ్ మహిళ.. తన ప్రియుడి కోసం సరిహద్దు దాటి అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టింది. ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ధర్మనగర్ సబ్‌ డివిజన్‌లోని ఫుల్‌బరీ నివాసి నూర్ జలాల్ (34) కబీరాజ్ (ఆయుర్వేదం) అభ్యసిస్తున్నాడు. ఇందుకోసం బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు తరచుగా వెళ్లేవాడు. ఈ సమయంలో నూర్ అవివాహితుడు.. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతేమా నుస్రత్ అనే వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. రోజులు గడిచేకొద్దీ.. ఫాతేమా, నూర్‌ల మధ్య బంధం బలపడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఆమె వివాహం చేసుకునేందుకు అక్రమంగా ధర్మనగర్‌కు చేరుకుంది. నూర్, ఫాతేమా ఇద్దరూ పుల్బరిలో నివాసం వుంటున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ వున్నట్లు సమాచారం అందడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios