మంచి ఉద్యోగం ఉంది.. జీవితం సాఫీగా సాగిపోతోంది. అనుకోని కారణంతో భర్తతో విడిపోవాల్సి వచ్చింది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కానీ ఆ బంధమే... ఆమె ప్రాణాలు కూడా తీసేసింది.  ఆమెతో అనైతిక బంధం పెట్టుకున్న వ్యక్తే.. ఆమె ప్రాణాలు తీసేస్తాడని ఊహించలేకపోయింది.  ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని కొరకుపేట కి చెందిన మోహన... రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కొంతకాలం క్రితం భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్న ఆమెకు కడలూరుకి చెందిన వీరా స్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త... వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం మోహన చట్టుపక్కల వారికి తెలియడంతో ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. దీంతో... తన గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారని.. వీరా స్వామిని ఇంటికి రావద్దని సున్నితంగా హెచ్చరిచింది. ఇంటి దగ్గర కాకుండా.. బయట పార్కుల్లో, హోటల్స్ లో ఇద్దరూ కలుసుకోవడం మొదలుపెట్టారు.

అయితే.. మునుపటిలాగా తనను ఇంటికి రానివ్వడం లేదని మోహన పై వీరా స్వామికి అనుమానం కలిగింది. తనలాగే మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఈ క్రమంలో భార్య భర్తలమని చెప్పి... ఓ లాడ్జికి ఇద్దరూ ఇటీవల వెళ్లారు. అక్కడ.. మోహనను వీరాస్వామి హత్య చేసి ఫ్యాన్ కి వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.