భార్యను హత్య చేసిన కేసులో భర్త జైలుకు వెళ్లాడు. ఆ కేసు దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ భార్య ఎంచక్కా ప్రియుడితో కలిసి జలంధర్ లో కాపురం పెట్టింది. దీంతో అంతా పాపం భర్త అనుకుంటున్నారు. 

బీహార్ : biharలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిందనుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి జలంధర్ లో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. ఆమెను భర్తే Murder చేశాడు అని.. ఆమె తండ్రి ఆరోపించడంతో ఆ మహిళ భర్త ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసును Triangle Love Storyగా అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెడితే... బీహార్‌లోని మోతిహారి జిల్లాలో ఓ మహిళ చనిపోయిందని.. ఆమెను భర్తే హత్య చేశాడని ఓ కేసు నమోదయ్యింది. ఈ నేరానికి గానూ భర్త Imprisonmentను కూడా అనుభవిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో పోలీసులకు ఓ దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. అదేంటంటే.. ఆ మహిళ చనిపోలేదని.. జలంధర్ లో ప్రియుడితో కలిసి కాపురం పెట్టిందని తెలిసింది.

శాంతి దేవి అనే మహిళ జూన్ 14, 2016న లక్ష్మీపూర్ నివాసి దినేష్ రామ్‌ని వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత శాంతి ఏప్రిల్ 19న భర్త ఇంటి నుంచి పారిపోయి పంజాబ్‌లో తన ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది. అయితే ఇక్కడ భర్త ఇంటిదగ్గర మహిళ అదృశ్యమైన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భర్త వరకట్న వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అంతేకాదు అతనే ఆమెను హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌ను అరెస్టు చేసి హత్యానేరం కింద జైలుకు తరలించారు.

వరకట్నం ఆరోపణలు చేసిన అత్తమామలు
శాంతి తండ్రి యోగేంద్ర యాదవ్ పోలీసులతో మాట్లాడుతూ, "నా కుమార్తె దినేష్‌రామ్‌ను 2016లో వివాహం చేసుకుంది, అయితే ఏప్రిల్ 19 న, ఆమె కనిపించడం లేదని మాకు సమాచారం అందింది. మేము ఆమె అత్తగారింటికి వెళ్లి చూస్తే కనిపించలేదు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. పెళ్లైన సంవత్సరమే.. అత్తమామలు మోటర్‌బైక్, రూ. 50,000 నగదు డిమాండ్ చేయడంతో పాటు నా కుమార్తెను కట్నం కోసం చిత్రహింసలు పెట్టారని తెలిపారు. దీంతో పోలీసులు ఆ తర్వాత దినేష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేశారు.

అయితే, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో శాంతి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను కనుగొనమని సాంకేతిక బృందాన్ని కోరడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెక్నికల్ సర్వైవలెన్స్ సాయంతో చనిపోయినట్లు ప్రకటించబడిన మహిళ వాస్తవానికి పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో తన ప్రేమికుడితో కలిసి కాపురం పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో ధనియాఖలి గ్రామంలో ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు దారుణంగా murder చేశారు. బాధితుడు liquor మత్తులో ఉన్న సమయంలో ఇనుప తీగతో గొంతుకోసి హత్య చేశారు. చంపా మాల్, ఆమె ప్రేమికుడు బేచారం మాలిక్ తో కలిసి తన భర్త నితిన్ సనాతన్ మాల్ (46)ని వదిలించుకోవడానికి వేసిన పథకంలో భాగంగా ఈ సంఘటన జరిగింది.

ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఫుల్లుగా మద్యం తాగించింది. అతడు తాగీ తాగీ పూర్తిగా మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదనుగా భార్య, ప్రియుడిని పిలిచి.. ఇనుప తీగతో భర్త గొంతు బిగించి హత్య చేశారు. ఆ తరువాత తమ నేరాన్ని కప్పిపుచ్చడానికి, సనాతన్ మాల్ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి బావిలో పడేశారు.

అయితే, బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోనుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం కోసం పంపించారు. కేసు దర్యాప్తులో మొదట వారికి ఎలాంటి క్లూ లభించలేదు.. ఈ క్రమంలో పోలీసులకు చంపపై అనుమానం వచ్చింది.

ధనియాఖలి స్టేషన్‌కు చెందిన నిరుపమ్ మండల్ ఇన్‌ఛార్జ్ అధికారి మాట్లాడుతూ, "మేము చంపాను విచారించడం ప్రారంభించినప్పుడు, మొదట ఆమె ఒప్పుకోలేదు.. ఆ తరువాత నెమ్మదిగా భర్తను ఎలా? ఎందుకు చంపింది.. చెప్పుకొచ్చింది’’.. అన్నారు.