Asianet News TeluguAsianet News Telugu

భర్త వేధింపులు.. ప్రేమగా దగ్గరైన మరిది... ఇద్దరూ కలిసి..

 ఆ సమయంలో.. ఆమెకు మరిది బాసటగా నిలిచాడు. దీంతో.. వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ బంధం గురించి భర్తకు తెలియడంతో.. ఇంటి నుంచి పారిపోయారు

woman elope with brother in law and after couple commits suicide in bihar
Author
Hyderabad, First Published Aug 11, 2021, 12:17 PM IST

పెళ్లై భార్యతో విడిపోయిన వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిపించారు. అయినా.. భర్తతో ప్రేమగానే ఉండేది. కానీ.. కొద్దికాలంగా భర్త వికృత రూపం చూపించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్త మామలు వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు ఆమె తట్టుకోలేక పోయింది. ఆ సమయంలో.. ఆమెకు మరిది బాసటగా నిలిచాడు. దీంతో.. వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ బంధం గురించి భర్తకు తెలియడంతో.. ఇంటి నుంచి పారిపోయారు.. 45 రోజుల తర్వాత తిరిగి వచ్చారు.. అయితే వచ్చిన రోజే ఇద్దరూ విషం తాగేశారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చక్‌జైనా గ్రామానికి చెందిన రాకేష్‌ను షబ్నం కుమారి ఏడాది క్రితం వివాహం చేసుకుంది. అయితే అప్పటికే రాకేష్‌కు మరో మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న షబ్నం.. రాకేష్‌తో గొడవపడేది. మొదటి వివాహం గురించి షబ్నం గొడవ చేయడంతో ఆగ్రహం చెందిన రాకేష్, అతని తల్లి, తండ్రి కట్నం గురించి అడగడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తీసుకు రమ్మని వేధించడం ప్రారంభించారు. అలాంటి సమయంలో షబ్నంకు రాకేష్ సోదరుడు కుందన్ కుమార్ బాసటగా నిలిచాడు. వదినకు మద్దతు పలుకుతూ తల్లిని, తండ్రిని ఎదురించేవాడు. ఆ క్రమంలో కుందన్, షబ్నం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం రాకేష్‌కు తెలియడంతో కుందన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి వేరే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా షబ్నం అక్కడకు వెళ్లేది. 

ఆ ఇద్దరిని చూసిన రాకేష్ వారిని చితకబాదాడు. తర్వాతి రోజు వారిద్దరూ కలిసి ఆ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో రాకేష్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫిర్యాదు గురించి తెలుసుకున్న కుందన్, షబ్నం సోమవారం రాత్రి నలందాకు తిరిగి వచ్చారు. రాత్రి నలందా రైల్వే స్టేషన్‌లోనే ఇద్దరూ విషం తాగేశారు. ఉదయం వరకు అలాగే ఉండిపోయారు. మంగళవారం ఉదయం వారిని గమనించిన రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుందన్ చనిపోగా.. షబ్నం ప్రాణాపాయ స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios