పంజాబ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నమ్మి వచ్చిన స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి, తొమ్మిది రోజులపాటు బందించి.. అత్యాచారం చేశాడు.
పంజాబ్ : స్నేహితుడని నమ్మితే కర్కశంగా కాటేశాడు. సహాయం చేయడానికి రమ్మని పిలిచి, ఆహారం లో మత్తు మందు కలిపి ఆమె మీద అత్యాచారం చేశాడు. తొమ్మిది రోజుల పాటు నిర్బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. స్నేహితుడు షాపింగ్ కి సహాయం చేయమని రమ్మంటే వచ్చిన అమ్మాయికి తినే పదార్ధాల్లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏకంగా తొమ్మిది రోజుల పాటు ఆమెను నిర్బంధించారు. స్పృహ వచ్చిన తర్వాత ఎలాగోలా ఆ కీచకుడి చెర నుంచి బయటపడింది ఆ యువతి. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లుధియానాలోని హతుర్ కు చెందిన జస్పాల్ సింగ్, బాధిత యువతి (26) ఇద్దరు స్నేహితులు. జస్పాల్ సింగ్ దుబాయ్ కి వెళుతున్నాడు. ఈ క్రమంలో తన దుబాయ్ ట్రిప్ కోసం షాపింగ్ చేయడానికి సహాయం కావాలని, సెప్టెంబర్ 30వ తేదీన రాయ్ కోట్ కు రావాలని యువతిని కోరాడు. దీంతో స్నేహితుడే కదా అని నమ్మిన యువతి.. అతని కోసం రాయ్ కోట్ కు వచ్చింది. అయితే అప్పటికే అతని మదిలో వేరే ఆలోచన నడుస్తోంది. స్నేహం ముసుగులో ఆమెను కాటెయ్యాలని పథకం పన్నాడు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం మత్తు మందు కలిపిన ఆహారాన్ని అతను ఆమెతో తినిపించాడు.
అందుకోసం సరస్వతిదేవీని పటాయించండి.. విద్యార్థులకు బిజెపి ఎమ్మెల్యే విచిత్రమైన సలహా
దాంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జస్పాల్ సింగ్ యువతిని ఉత్తరప్రదేశ్లోని ఓ రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అప్పటి నుంచి తొమ్మిది రోజులపాటు ఆమెపై అత్యాచారం చేశాడు. అక్టోబర్ 8న యువతి స్పృహలోకి రాగా, ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనూ అతని యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. మొత్తానికి ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వచ్చిన యువతి కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జస్పాల్ సింగ్ పై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 342, 376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
